»   » లంగా ఓణిలో అంజలి సెక్సీ లుక్ (ఫోటోలు)

లంగా ఓణిలో అంజలి సెక్సీ లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోయిన్ అంజలి లంగాఓణిలో సెక్సీ‌లుక్‌తో తన రాబోయే సినిమాలో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం అంజలి 'మసాలా' చిత్రంలో నటిస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో పెయిర్ గా అదరకొట్టిన వెంకటేష్ మరియు అంజలి మరోసారి 'మసాలా' సినిమాలో ఆయనతో రొమాన్స్ చేయబోతోంది.

ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. త్వరలో వెంకటేష్-అంజలి కలిసి జపాన్ వెళ్లబోతున్నారు. అక్కడ అందమైన లొకేషన్లలలో వీరిపై పాటను తీస్తారని తెలుస్తోంది. ఈ పాటతో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. బాలీవుడ్లో హిట్ అయిన 'బోల్ బచ్చన్' చిత్రానికి రీమేక్‌గా 'మసాలా' చిత్రం రూపొందుతోంది.

బోల్ బచ్చన్ చిత్రంలో అజయ్ దేవగన్ పోషించిన పాత్రను 'మసాలా' చిత్రంలో వెంకటేష్ చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. కె విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్, సురేష్ బాబు నిర్మిస్తున్నారు.

వివాదాల్లో అంజలి

వివాదాల్లో అంజలి

హీరోయిన్ అంజలి ఈ మధ్య పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. తన పిన్ని భారతీ దేవి, తమిళ దర్శకుడు కళంజియంతో ఏర్పడ్డ విబేధాల కారణంగా ఆమె మీడియా ముందుకు వచ్చి వారిపై సంచలన కామెంట్లు చేసింది. తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, డబ్బుకోసం వేధిస్తున్నారని ఆరోపించి....అనంతరం వారి నుంచి ప్రాణభయం ఉందంటూ అజ్ఞాతంలోకి వెళ్లి అందరినీ హైరానా పెట్టింది.

అంజలి గ్లామర్

అంజలి గ్లామర్

అంజలి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్. తన సెక్సీ ఒంపు సొంపులు, ముద్దబంతి లాంటి నిండైన రూపం, ఆకట్టుకునే అభినయం వెరసి ఇటు తెలుగుతో పాటు, అటు తమిళంలో పలు అవకాశాలతో బిజీబిజీగా గడుపుతోంది.

సినిమాల్లోకి..

సినిమాల్లోకి..

Kattradhu Thamizh అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అంజలి తొలి సినిమాతోనే ‘ఉత్తమ తెరంగ్రేట నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, సౌత్ విజయ్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత వరుస తమిళ చిత్రాలతో హీరోయిన్ గా ఎదిగింది.

తెలుగులో

తెలుగులో


‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన అంజలి ఆ చిత్రం విజయంతో రవితేజ ‘బలుపు' చిత్రంతో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం వెంకటేష్‌కు జోడీగా ‘మసాలా' చిత్రంలో నటిస్తోంది.

భవిష్యత్ ప్రాజెక్టులు

భవిష్యత్ ప్రాజెక్టులు

ప్రస్తుతం అంజలి ‘మసాలా' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు మరిన్ని ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉంది. త్వరలో ఆ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

English summary
Actress Anjali Half Saree look. Anjali is an Indian film actress and model, who predominantly appears in Tamil films along with few Telugu movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu