అర్థరాత్రి పోలీసుల ముందు హాజరైన అంజలి
ఆ తర్వాత డీసీపీ సుధీర్ బాబు అంజలిని రెండు గంటల పాటు ప్రశ్నించారు. తను అదృశ్యం కావడానికి గల కారణాలను అంజలి డీసీపీకి వివరించింది. అనంతరం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... నేను ఎక్కడికీ పారి పోలేదని, సోమవారం నుంచి షూటింగుల్లో పాల్గొంటానని వెల్లడించారు.
మానసిక ఒత్తిడితోనే బయటకు వెళ్లిపోయానని చెప్పిన అంజలి.... పిన్ని, బాబాయ్‌ల వ్యవహారంపై మీడియా వారు ప్రశ్నించగా తాను అసలి పోయి ఉన్నానని, అన్ని వివరాలు తర్వాత చెబుతానన్నారు. డీసీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ అంజలి ఇన్నాళ్లు ముంబైలో ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిపారు.
కాగా... అంజలి వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన వెంట డబ్బు తీసుకు వెళ్లలేదని చెప్పి అంజలి ముంబై వరకు ఎలా వెళ్లింది? ఇన్నాళ్లు ఎవరి రక్షణలో ఉంది? ఆమెకు సహాయం చేసింది ఎవరు? దస్పల్లా హోటల్ నుంచి ఆమెను తీసుకెళ్లింది ఎవరు? ప్రస్తుతం ఆమెను తీసుకొచ్చిన వాహనం చెన్నకేశవులుకు సంబంధించినది. అతనికి అంజలికి సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications












