హీరోయిన్ అంజలికి... సెక్యూరిటీగా బాడీగార్డులు
పిన్ని భారతీ దేవితోపాటు, తమిళ దర్శకుడు కళంజియంతో అంజలికి వివాదాలు ఏర్పడ్డ ఈ నేపథ్యంలో ఆమె గత కొంత కాలంగా హైదరాబాద్‌లోనే ఉంటోంది. వివాదాల నేపథ్యంలో తనకు ఏమైనీ హాని చేస్తారనే అనుమానంతో అంజలి ప్రొఫెషనల్ బాడీగార్డులను నియమించుకోవాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాను సినిమా పనుల నిమిత్తం చెన్నై వెళ్లిన సందర్భంలో బాడీగార్డులను వినయోగించుకున్నట్లు తెలుస్తోంది.
పెంచి పెద్ద చేయడంతో పాటు, అంజలిని హీరోయిన్‌గా చేయడానికి ఇప్పటి వరకు రూ. 70 లక్షలు అప్పులు చేసి ఖర్చు పెట్టానని, అంజలి ఇప్పుడు తనను విడిచి వెళ్లింది కాబట్టి నెలకు రూ. 50 వేలు జీవన భృతి చెల్లించాలని కోరుతూ భారతీదేవి గత నెలలో ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖ చేసారు. పిటీషన్‌ను బుధవారం కోర్టు విచారణకు స్వీకరించి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.
మరో వైపు అంజలిపై దర్శకుడు కళంజియం వేసిన పరువు నష్టం పిటీషన్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కూడా అంజలి పలు మార్లు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె ఒక్కసారి కూడా కోర్టు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications












