హీరోయిన్ అంజలి అదృశ్యం, ఏమైపోయినట్లు?
హైదరాబాద్: తన పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం కలిసి తనను వేధిస్తున్నారని, తన వెనక గోతులు తవ్వి డబ్బు మింగేస్తున్నారని, తనను ఏటీఎం మిషన్‌లా వాడుకున్నారని మీడియాకు వెల్లడించి వివాదానికి తెరలేపిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' హీరోయిన్ అంజలి ఉన్నట్టుండి కనబడకుండా పోయింది. నిన్న సాయంత్రం మీడియాకు తన గోడు వెళ్లబోసుకున్న అంజలి కొన్ని గంటల్లోనే అదృశ్యం అయింది.
వెంకటేష్-రామ్ హీరోయిన్‌గా రూపొందుతున్న బోల్ బచ్చన్ రీమేక్ మూవీలో అంజలి నటించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బెంగుళూరు పరిసరాల్లో ప్రారంభం అయింది. అయతే షూటింగుకు సైతం ఆమె అందుబాటులోకి రాలేదు. ఆమెకు తెలిసిన వారితోపాటు, మీడియా వారు ఆమెతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించగా ఫోన్ స్విచాఫ్ వస్తోంది.
దీంతో అంజలి ఏమైంది? ఎక్కడికెళ్లింది? అనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయంది. మరో వైపు తనపై ఆరోపణలు చేసిన అంజలిపై తమిళ దర్శకుడు కళంజియం చెన్నై పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు కూడా ఆమె ఆచూకీపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు ఎదుగుతున్న హీరోయిన్ అంజలిని సమస్యలు చుట్టుముట్టడంపై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత ఆమెకు అభిమానులుగా మారిన ఫ్యామిలీ ఆడియన్స్ అంజలి పరిస్థితిని చూసి అయ్యో పాపం అంటూ..... సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











