For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోలీస్ కంప్లైంట్: త్రాగి,తిడుతూ పబ్ లో అంజలి హంగామా

  By Srikanya
  |

  హైదరాబాద్: హైదరాబాద్ లో ని ఓ పబ్ లో మధ్యం మత్తులో సినీ నటి అంజలి హల్ చల్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1 లోని తబల పబ్ కు శుక్రవారం రాత్రి అంజలి తన స్నేహితులతో కలిసి వచ్చింది. అందరూ కలిసి మధ్యం సేవించి, అనంతంరం డాన్స్ ఫ్లోర్ వద్దకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. అదే సమయంలో ఓ యువకుడు అంజలికి అడ్డువచ్చాడు. దీంతో మధ్యం మత్తులో ఉన్న అంజలి అతన్ని తిట్టడంతో పాటు నిర్వాహకులపైనా తిట్ల దండంకం ప్రారంభించింది. పరిస్ధితి శ్రుతిమించటంతో నిర్వాకులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో పంజాగుట్ట పోలీసులు పబ్ కి వెళ్లి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
  అంజలి కెరీర్ విషయానికి వస్తే...

  కోన వెంకట్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన 'గీతాంజలి'లో అందర్నీ భయపెట్టిన తెలుగమ్మాయి అంజలి. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగించడానికి సిద్ధమవుతోంది. అంజలి ప్రధాన పాత్రలో విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'పిల్ల జమిందార్‌'తో ఆకట్టుకొన్న అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. అమెరికాలో చిత్రీకరణ జరుగుతోంది. జనవరి 10 వరకు అక్కడే కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఇది ఉత్కంఠ, వినోదం జోనర్‌లో సాగే చిత్రమని తెలుస్తోంది.

  Actress Anjali Night Drink Party Controversy
  భాగమతి అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమాలోని టైటిల్ పాత్రలో అనుష్క నటించనుందని తొలుత ప్రచారం జరిగింది. ప్రస్తుతం అనుష్క బాహుబలి, రుద్రమదేవి చిత్రాలతో బిజీగా వుండటం వల్ల ఆ స్థానంలో అంజలిని దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకున్నారని తెలిసింది. ఆసక్తికరమైన కథ, అభినయానికి ఆస్కారం వుండటంతో అంజలి ఈ సినిమాలో నటిండానికి సుముఖత వ్యక్తం చేసిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ అంజలి. ఆ తర్వాత తను చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ సంవత్సరం అంజలి చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గీతాంజలి' పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలకే కాకుండా లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ కి కూడా బాగా సరిపోతుందని పేరొచ్చింది. దాంతో అంజలికి మళ్ళీ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే అంజలి మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తేలియజేశాం.

  ఆ సినిమాకి భాగమతి అనే టైటిల్ ని ఖరారు చేసారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కోసం అంజలి కోటి రూపాయల దాకా పారితోషికం తీసుకున్నట్లు అంటున్నారు. దీన్ని బట్టి సక్సెస్ ఉన్నప్పుడే నాలు రాళ్ళు వెనకేసుకోవాలనే ఫార్ములాని అంజలి బాగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ‘పిల్లా జమిందార్' ఫేం అశోక్ దర్శకత్వం వహిచబోయే తాజా సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తారు.

  English summary
  Actress Anjali was drink and dance in late night drink party at Hyderabad Pub. Actress Anjali was one of the fame actresses in telugu and tamil but after she had a problem with her relative and director Kazhangiyam, hasn’t committed any new films in Tamil Cinema.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X