అంజలికి చెప్పలేని రోగమన్న పిన్ని, అన్నీ అనుమానాలే!

అయితే అంజలి అవేమీ చెప్పకుండా దాట వేసే ప్రయత్నం చేసింది. అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఫోన్లో తమ్ముడితో మాట్లాడుతూ....నన్ను పిన్ని భాబాయ్ కొట్టడం వల్లనే వెళ్లానని చెప్పిన అంజలి ఇప్పుడు మానసిక ఒత్తిడి, అనారోగ్యం అంటూ కొత్త పల్లవి అందుకుంది. దీంతో అంజలి వ్యవహారం సర్వత్రా అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఈ నెల 8న హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్‌లో అదృశ్యమైన అంజలి ఐదు రోజుల తర్వాత బయటుక వచ్చింది. మొదటి మూడు రోజులు అంజలి ఏమైదో ఎవరికీ తెలియదు. ఆమె విషయమై ఇంత హడావుడి జరుగుతున్నాఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత...తీరిగ్గా ఫోన్ చేసి తన క్షేమ సమచారం అందించింది.
మరో వైపు ఇంతకాలం తాను ఎక్కడ ఉంది, ఎవరి సహాయంతో అదృశ్యమైంది. దస్పల్లా హోటల్ నుంచి ఎవరి సహాయంతో వెళ్లింది. తిరిగి రావడానికి ఎవరు సహకరించారు...ఇలాంటి విషయాలను అంజలి దాస్తోంది. దీన్ని బట్టి అంజలి పోలీసులను, మీడియాను, ఫిల్మ్ ఇండస్ట్రీని తప్పుదారి పట్టిస్తుందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
కాగా....ఆమె పిన్ని భారతీదేవి అంజలికి చెప్పలేని రోగం ఉందని ఆరోపించింది. మరి నిజంగానే అంజలికి చెప్పలేని రోగం ఏమైనా ఉందా? మరో వైపు అంజలి అపాయంలో ఉందని, ఆమెను రక్షించాలని ఆమె పిన్ని భారతీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మరి అంజలి ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించలేదు. అదే విధంగా ఆమెతో సన్నిహితంగా మెలుగుతున్న నిర్మాత సురేష్ కొండేటిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంజలి ఈ అనుమానాలను ఎప్పుడు నివృత్తి చేస్తుందో..లేదో చూడాలి?


Click it and Unblock the Notifications











