హీరోయిన్ అంజలి క్షేమం, తల్లికి ఫోన్
అంజలి క్షేమంగా ఉందని తేలడంతో...జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమె కనబడుట లేదు అని ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు కేసును విత్‌డ్రా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కేసు విత్రా చేసుకోవాలని అంజలి చెప్పినట్లు ఆమె అసలు తల్లి మీడియాకు వివరించింది. అయితే ఆమె ఎక్కడ ఉందనే విషయం మాత్రం వెల్లడించలేదు.
అయితే పోలీసులు కూడా ఆమె ఎక్కడ ఉందనే వివరాలు ఇంకా తెలియదని అంటున్నారు. ప్రస్తుతం ఆమె బెంగుళూరు పరిసరాల్లో ఉన్నట్లు సమచారం. ఈ రోజు నుంచి అంజలి నటిస్తున్న 'బోల్ బచ్చన్' రీమేక్ సినిమా షూటింగ్ ఇక్కడ మొదలు కాబోతోంది. ఈ రోజు ఆమె షూటింగులో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగి పలు అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ అంజలి ఉన్నట్టుండి వివాదంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే.
అంజలి అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణం భారతీదేవి, కళంజియంలతో ఉన్న గొడవలే కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. పిన్ని భారతీదేవి డబ్బు కోసం వేధిస్తోందని, నన్ను ఏటీంఎం మిషన్ లా వాడుకుంటున్నారని, వారి నుంచి ప్రాణభయం ఉందని అంజలి ఇప్పటికే మీడియాకు వెల్లడించింది.
అయితే అంజలికి, కళంజియం మధ్య చెడటానికి కారణం వేరే వినిపిస్తోంది. కళంజియం తానే హీరోగా ఓ తమిళ సినిమాను మొదలు పెట్టాడని, ఇందులో తన పక్కన అంజలిని హీరోయిన్‌గా నటించాలని ఒత్తిడి తెస్తున్నాడని, భారతీ దేవి కూడా ఇదే విషయమై ఆమెపై ఒత్తిడి తెచ్చేదని, కళంజియంతో కలిసి నటించడం ఇష్టం లేకనే అంజలి హైదరాబాద్ వచ్చినట్లు చర్చించుకుంటున్నారు.
మరి అంజలి మీడియా ముందుకు వచ్చి నోరు విప్పితే...ఈ గొడవల వెనక ఉన్న అసలు కారణం, అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణం ఏమిటి, రెండు రోజులు ఎక్కడ ఉన్నది అనే విషయాలు వెలుగులోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications












