»   » ఉరి వేసుకుని సినీ నటి ఆత్మహత్య

ఉరి వేసుకుని సినీ నటి ఆత్మహత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: భోజ్‌పురి నటి అంజని శ్రీవాస్తవ(29) ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనే విషయం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... అంజని శ్రీవాస్తవ ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిప్ట్ చేయక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమె నివాసం ఉంటున్న సొసైటీ సభ్యులకు ఫోన్ చేసి డూప్లికేట్ కీ ద్వారా ఇంటి తలుపు తెరవగా ఇంట్లోని బెడ్రూంలో సిలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.

Actress Anjali Srivastava hangs herself to death

వెంటనే ఆమెను సమీపంలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. సూసైడ్ లెటర్ లాంటివి ఏమీ లేక పోవడంతో ఆమె ఏ కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందనే విషయం ఇంకా బయటకు రాలేదు.

English summary
29-year-old popular Bhojpuri actress Anjali Srivastava has reportedly committed suicide at her Andheri house in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu