గుడ్ న్యూస్: హీరోయిన్ అంకితకు కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!
లాహిరి లాహరి లాహరిలో, సింహాద్రి ఫేమ్ అంకిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
లాహిరి లాహిరి లాహిరిలో, సింహాద్రి సినిమాల ద్వారా పాపులర్ అయిన హీరోయిన్ అంకిత అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిలైన సంగతి తెలిసిందే. ఎన్ఆర్‌ఐ బిజినెస్‌మేన్ విశాల్ జగ్తాప్‌ను ఆమె పెళ్లాడారు.
2016 మార్చిలో విశాల్ జగ్తాప్, అంకిత వివాహం జరిగింది. తాజాగా ఈ దంపతులు తల్లిదండ్రులయ్యారు. అంకిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకుంటూ బిడ్డతో కలిసి దిగిన ఫోటోను విశాల్ జగ్తాప్-అంకిత దంపతులు షేర్ చేశారు.

అంకిత అభిమానులు, సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన స్నేహితులు ఈ గుడ్ న్యూస్ తెలిసిన వెంటనే ఈ దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్టు చేస్తున్నారు.
పూణే కు చెందినా విశాల్ జగ్తాప్‌తో అంకితకు అమెరికాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరువురు పెద్దల అంగీకారంతో గతేడాది మార్చ్ 28న ఒక్కటయ్యారు.


Click it and Unblock the Notifications











