twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ఉరి వేసుకొని ఆత్మహత్య

    By Rajababu
    |

    సీనియర్‌ నటి అన్నపూర్ణ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. అన్నపూర్ణ కూతురు కీర్తి సూసైడ్ చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ దారుణం చోటుచేసుకొన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనారోగ్య సమస్యలే కీర్తీ ఆత్మహత్యకు కారణమని తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

    ఫ్యాన్‌కు ఉరి వేసుకొని

    ఫ్యాన్‌కు ఉరి వేసుకొని

    కీర్తి శ్రీనగర్‌ కాలనీలోని కృష్ణా అపార్ట్‌మెంట్‌లోని సొంత నివాసం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. తన కూతురికి మాటలు రాకపోవడంతో ఇటీవల కాలంలో కీర్తి డిప్రెషన్‌కు గురయ్యారు. ఆ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేకనే కీర్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

    కూతురుకి మాటలు రాకపోవడంతో

    కూతురుకి మాటలు రాకపోవడంతో

    అన్నపూర్ణకి పిల్లలు లేకపోవడంతో కీర్తిని దత్తత తీసుకొని 3 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. కీర్తి భర్త వెంకట కృష్ణ కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌లోని ఎఫ్‌సీఐలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. వీరికి సంవత్సరం వయసున్న కూతురు ఉన్నారు. ఈ చిన్నారికి సరిగా మాటలు రాకపోవడంతో కొంత కుంగిపోయారని బంధువులు పేర్కొన్నారు.

    కూతురుపై బెంగతో

    కూతురుపై బెంగతో

    నా కూతురు బిడ్డకు సరిగా మాటలు రావడం లేదు. సరిగా మాట్లాడేందుకు చిన్నారికి స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నాం. ఈ నేపథ్యంలో నా బిడ్డకు మాటలు వస్తాయో రావో అనే అంశంపై బెంగ పడిన కీర్తి మానసిక రుగ్మతకు లోనయ్యారు అని అన్నపూర్ణ పేర్కొన్నారు.

    డోర్లు పగులగొట్టి

    డోర్లు పగులగొట్టి

    నా మనువరాలికి ఏమీ కాదని పలు మార్లు కీర్తికి ధైర్యం చెప్పాం. ఈ మధ్య ఆ షాక్ నుంచి తేరుకోవడానికి మానసిక వైద్యుడి చేత కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. బెడ్ రూమ్ డోర్ నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చింది. ఎంత కొట్టినా డోర్ తీయలేదు. దాంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూస్తే... ఉరి వేసుకొని కనిపించింది'' అని అన్నపూర్ణ తెలిపారు

    ప్రాథమిక విచారణ పూర్తి

    ప్రాథమిక విచారణ పూర్తి

    ప్రాథమిక విచారణ తర్వాత కీర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు పోలీసులు తరలించారు. కీర్తి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించామని పోలీసులు పేర్కొన్నారు.

    English summary
    Actress Annapoorna daughter Kirthi attempted suicide. She died at her residence in Srinagar colony of Hyderabad. She has been suffering with depression due her daughter health reasons. Police filed a case and investigating furthuer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X