ఈ షూట్ లో అనుష్క గ్లామర్ ఎక్కడికో..ఓ రేంజ్ కి వెళ్లిపోయింది..!
'సౌత్ లో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే ఒక నాలుగైదు పేర్లు ఎక్కువగా వినిపించవచ్చు కానీ మాట్లాడుకోవాలంటే మాత్రం ఆ ప్లేస్ ఇప్పుడు అనుష్కదే అనాలి. ప్రస్తుతం అనుష్కకి తీరిక లేనంతగా అవకాశాలున్నాయి. అగ్రహీరోల నుంచి పొడుగ్గా ఉండే యువ హీరోల వరకు చాలా మందికి అనుష్క కథానాయికగా కావాలి. అంతే రేంజ్ కి ఎదిగి పోయింది.
టాలీవుడ్ హీరోయిన్లలో కొంతమంది మాత్రమే ఛాలెంజింగ్ రోల్స్ వేస్తుంటారు. అటువంటివారిలో అనుష్క ముందు వరుసలో ఉంటుంది. ఆమె ఎంపిక చేసుకునే పాత్రలు వేటికవే విభిన్నమైనవిగా ఉంటాయి. ప్లాప్ వరిస్తుందేమోనన్న భయం లేకుండా ఒప్పేసుకుంటుంది అనుష్క. అలాంటి ధైర్యమే ఆమెను నెంబర్ల రేసులో ముందువరుసలో నిలుచోపెట్టింది. ప్రస్తుతానికి కోలీవుడ్ సినిమాలతో బిజీబిజీగా ఉన్న అనుష్క టాలీవుడ్‌కు కాస్త బ్రేక్ కొట్టినట్లే కనబడుతోంది.
ఇటీవల ఆమె గ్లామర్ ప్రధానాంశంగా ఉన్న ఓ చిత్రాన్ని అంగీకరించిందని సమాచారం. ఇందుకోసం తాజాగా ఆమె ఓ ఫోటోషూట్ ను ఇచ్చినట్లు సమాచారం. ఈ షూట్ లో అనుష్క గ్లామర్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నదని టాలీవుడ్ సినీజనం చెపుతున్నారు. మొత్తానికి మరోసారి మాస్ ప్రేక్షకులను అలరించేందుకు అనుష్క సిద్ధమైపోతోందన్నమాట.


Click it and Unblock the Notifications











