»   » ప్రేమ పుట్టొచ్చు: పెళ్లి‌పై హీరోయిన్ అనుష్క హాట్ కామెంట్

ప్రేమ పుట్టొచ్చు: పెళ్లి‌పై హీరోయిన్ అనుష్క హాట్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు హల్ చల్ చేస్తుంటాయి. 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాలు పూర్తయిన తర్వాత అనుష్క పెళ్లి పీటలెక్కడం ఖాయమనే వార్తలు ఆ మధ్య తెగ హడావుడి చేసాయి. ఆ మధ్య అనుష్క దుబాయ్ లో షాపింగ్ చేసిందని.... ఎంగేజ్ మెంట్, పెళ్లికి సంబంధించిన షాపింగే అని, తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని చేసుకోవడానికి అనుష్క పచ్చజెండా ఊపేసిందని ప్రచారం జరిగింది.

అయితే ఇదే విషయమై అనుష్కను అడిగితే అలాంటిదేమీ లేదంటోంది. అసలు తనకు ఇపుడు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదంటోంది. స్త్రీకి వివాహం అనేది చాలా ముఖ్యమైన విషయమని తెలుసు. అయితే ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించే సమయం నాకు లేదు. నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆలోగా ప్రేమ పుట్టవచ్చు. లేదా తల్లిదండ్రులే మంచి వరుణ్ణి చూడవచ్చు. ఆ విషయమైనా సమయం వచ్చినపుడు చెబతాను. అప్పటి వరకు నా పెళ్లి గురించి, ప్రేమ గురించి ఎలాంటి వార్తలు నమ్మ వద్దు అంటోంది అనుష్క.


Actress Anushka Shetty about marriage rumors

గడిచిన ఆరేళ్లలోనా పెళ్లి గురించి మీడియాలో రకరకాల వార్తలు విన్నాను. పెళ్లికి సంబంధించిన విషయాల్లో నేను తప్పించుకోవడానికి ఏమీ ప్రయత్నించడం లేదు. సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. అందరినీ ఆహ్వానించి పెళ్లి చేసుకుంటా. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అందరికీ తెలిసే జరుగుతుంది' అని స్పష్టం చేసారు.

English summary
"Since the past six years, Several reports appeared in media regarding my marriage. I won't escape saying marriage is something very personal but at the same time a secret wedding isn't on my mind" Anushka Shetty said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu