ప్రభాస్‌ దేవుడు అంటూ పొగడ్తలు, అనుష్క సంతోషం....మిస్సైతే బాధపడేదంట!

By Bojja Kumar

Recommended Video

ప్రభాస్‌ దేవుడు అంటూ పొగడ్తలు.. అనుష్క సంతోషం !

అనుష్క టైటిల్ పాత్ర‌లో యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో న‌టించిన చిత్రం భాగ‌మ‌తి. అశోక్ ద‌ర్శ‌కుడు. వంశీ, ప్ర‌మోద్ నిర్మాత‌లు. ఈ సినిమా జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.

ప్రభాస్ దేవుడు అంటూ

ప్రభాస్ దేవుడు అంటూ

దర్శకుడు అశోక్ మాట్లాడుతూ..... గెల‌వాల‌నుకున్న‌ప్పుడు క‌ష్టం మొద‌ల‌వుతుంది. ఎలాగైనా గెల‌వాల‌నుకున్న‌ప్పుడు మోసం మొద‌ల‌వుతుంది. ఈ రెండు స‌మాంత‌రంగా న‌డుస్తుంటాయి. త‌ను గెలుస్తూ.. త‌న చుట్టూ ఉన్న వారిని గెలిపిద్దాం అని ఎవ‌రైనా ఆలోచిస్తే .. అతడు మనిషి కాదు, దైవత్వం అతడిలోఎంటరైనట్లు, అలాంటి ఒక దేవుడు ముందు ఈ క‌థ విన్నారు. ఆ దేవుడు ఈ రోజు రాలేక పోయారు. అతడు మరెవరో కాదు ప్ర‌భాస్‌గారు. ఆయ‌న ఈ క‌థ విని, ఇక్క‌డి దాకా న‌డిపించారు.... అని తెలిపారు.

నిర్మాతలకు సినిమా అంటే వేలం వెర్రి

నిర్మాతలకు సినిమా అంటే వేలం వెర్రి


ఈ సినిమా విషయంలో ఆ దేవుడి తర్వాత ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. వారే వంశీ, ప్ర‌మోద్‌, విక్కిగారు. వీళ్లలో ఒక‌రు నిర్ణ‌యం, ఒక‌రు ముందుకు న‌డిపించ‌డం, మ‌రోకరు వెనక ఉండి సరిగా న‌డిపించ‌డం చేశారు. సినిమా అంటే పిచ్చి అని అంటుంటారు కొందరు. దాన్ని పాషనేట్ అని పోష్ గా చెప్పి కట్ చేయను... సినిమా తీయడం అంటే వీరికి వేలం వెర్రి. అంత ఇష్టంగా సినిమా తీస్తారు. అర్దరాత్రి పూట కూడా ఫోన్ చేసి తమ డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. చిన్న చిన్న విష‌యాల‌ను కూడా ప‌ట్టించుకుని.. సినిమాను జాగ్రత్తగా ఒక బిడ్డను మొదటి నుల నుండి బిడ్డ‌లా చూసుకున్నారు.... అని అశోక్ తెలిపారు.

చాలా కష్టపడ్డారు

చాలా కష్టపడ్డారు

మిర్చి అయిన 2 నెలల నుండి వీరితో ఐదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాను. వారు చేసిన అన్ని సినిమాలను పరిశీలిస్తున్నాను. ప్రతి సినిమాను చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఈ సినిమాకు ఇంకా ఎక్కువ శ్ర‌మ‌, పెట్టుబడిని, అంతకు మించి మాన‌సిక ఒత్తిడిని తీసుకుని చేశారు.... అని దర్శకడు చెప్పుకొచ్చారు.

స్వీటి అంటే ఒక శక్తి

స్వీటి అంటే ఒక శక్తి

ఈ సినిమాకు శక్తి స్వీటీ. స్వీటీ అంటే ఒక అనుభూతి. త‌ను ఒక శ‌క్తి.... అరుంధ‌తిగా అనిపిస్తే అరుంధ‌తిగా, స‌రోజ‌గా అంటే స‌రోజ‌లా.. రుద్ర‌మ‌దేవిగా అంటే రుద్ర‌మ‌దేవిలా క‌న‌ప‌డ్డ అనుష్క ఇప్పుడు భాగ‌మ‌తిగా క‌న‌ప‌డ‌బోతున్నారు.... అని అశోక్ తెలిపారు.

అనుష్క పడ్డ కష్టం చూసి బాధ అనిపించింది

అనుష్క పడ్డ కష్టం చూసి బాధ అనిపించింది


ఈ సినిమా కోసం అనుష్క ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు. విప‌రీత‌మైన డ‌స్ట్‌లో 45 రోజులు ఈ సినిమా చేశారు. మేక్ కొట్టుకుంటున్న షాట్ చాలా బావుందని అంతా అంటున్నారు. ఒక అరగంట ఇలా చేయి పైకి పట్టుకుని నిలబడితే మనకు నొప్పులు వస్తాయి. రెండు రోజులు ఆమె అలా నిలబడితే ఆమెకు ఎంత నొప్పి వచ్చిందో అని నేను చాలా బాధ పడ్డాను. అంత ఒత్తిడి తీసుకుని సినిమా చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు అని.... దర్శకుడు వ్యాఖ్యానించారు.

టెక్నీషియన్ల గురించి

టెక్నీషియన్ల గురించి

ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్స్ మ‌ది, మ‌నోజ్ ప‌ర‌మ‌హంస ఇలా అంద‌రూ టెక్నిషియ‌న్స్ క్యారెక్ట‌ర్‌లా ఫీలై చేసిన సినిమా ఇది. ఏడాదిన్న‌ర పాటు నాతో పాటు ట్రావెల్ చేశారు. అద్భుత‌మైన సినిమా రూపొండంలో స‌హ‌క‌రించిన అంద‌రికీ థాంక్స్‌. సినిమా జ‌న‌వ‌రి 26న విడుద‌ల‌కానుందని అశోక్ తెలిపారు.

ఈ సినిమా మిస్సయితే బాధపడేదాన్ని: అనుష్క

ఈ సినిమా మిస్సయితే బాధపడేదాన్ని: అనుష్క

అనుష్క మాట్లాడుతూ - `` 2012లో క‌థ విన‌గానే నాకు నచ్చింది. నా హార్ట్ కు బాగా దగ్గరైన కథ. అయితే డేట్స్ లేక‌పోవ‌డంతో చేయ‌లేన‌ని చెప్పినా కూడా నా కోసం ఇప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేశారు. అందుకు నిర్మాతలకు థాంక్స్. అలా కాకుండా ఈ సినిమా వేరే వారికి వెళ్లి ఉంటే నేను చాలా బాధ పడేదాన్ని. ఇది అనుష్క సినిమా మాత్ర‌మేన‌ని చెప్ప‌ను. ఉన్ని ముకుంద‌న్‌, జ‌య‌రాం, ఆశా శ‌ర‌త్‌, ప్ర‌భాస్ శ్రీను, ధ‌న‌రాజ్‌, విద్యుల్లేఖ, ర‌వీందర్‌, త‌మ‌న్ స‌హా అంద‌రి సినిమా ఇది. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X