సినీ ఇండస్ట్రీకి రాకముందు అనుష్క ఇలా...(బర్త్ డే స్పెషల్)

By Bojja Kumar

హైదరాబాద్ : హీరోయిన్ అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో కూడా పని చేసారు. అప్పుడు తన సహచర ఉపాధ్యాయులతో కలిసి దిగిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. నాగార్జున హీరోగా రూపొందిన ‘సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. నేడు అనుష్క పుట్టినరోజు. నవంబర్ 7, 1981లో జన్మించిన అనుష్క నేడు 34వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి. సినిమాల్లోకి వచ్చాక అనుష్కగా పేరు మార్చుకుంది. అనష్క సినీ రంగ ప్రవేశం అందాల ఆరబోతతోనే ప్రారంభం అయింది. తన సోకుల ప్రదర్శనతో కుర్రకారులో మధురభావనలు రేపింది. వేదంలో సరోజగా కవ్వించినా, బిళ్లాలో బికినీతో కనిపించినా, విక్రమార్కుడుతో అందాలతో విజృభించినా, రగడతో అందాల రచ్చరచ్చ చేసినా, తాజాగా బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో వీరనారిగా కనిపించినా ఆమెకు ఆమే పోటీ..సాటి అన్నట్లుగా వెండి తెరను ఏలుతోంది.

ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. మొదట్లో అనుష్క అందాల ప్రదర్శనికే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే అరుంధతి నుంచి ఆమె ఇమేజ్ మారింది. అందులో ఆమె అద్బుత నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా మారిన అనుష్క ఇప్పుడు భారీ పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలు కేవలం అందాల ఆరబోతకు, హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ వీరందరికీ భిన్నంగా రాణిస్తోంది హాట్ అండ్ సెక్సీ తార అనుష్క. ఇటు గ్లామర్ పాత్రలతో పాటు ఇటు భారీ యాక్షన్ పాత్రలకు ఆమెను మించిన ఆప్షన్ తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు దొరకడం లేదు. హీరోయిన్ గా టాప్ లో ఉన్న అనుష్క ‘సైజ్ జీరో' లాంటి సినిమాలు చేయడం విశేషం. ఈ సినిమా కోసం ఆమె భారీగా బరువు పెరిగింది.

అనుష్క

అనుష్క


ఈస్ట్‌వుడ్ పాఠశాలలో సహచర ఉపాధ్యాయులతో కలిసి అనుష్క, రెండో లైన్లో 7వ వ్యక్తి

భారీ ప్రాజెక్టులు...

భారీ ప్రాజెక్టులు...


ప్రస్తుతం అనుష్క బాహుబలి 2 సినిమాలో నటిస్తోంది.

అనుష్క అందం, అభినయానికి నీరాజనం

అనుష్క అందం, అభినయానికి నీరాజనం


సూపర్ తర్వాత అస్త్రం, చింతకాయల రవి, స్వాగతం, ఒక్క మగాడు వంటి చిత్రాలు చేసినా రాని బ్రేక్ రాజమౌళి విక్రమార్కుడుతో వచ్చింది. అందులో క్లైమాక్స్ లో జింతాత అంటూ ఆమె చేసే అభినయానికి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

చిరంజీవితో ఐటం సాంగ్

చిరంజీవితో ఐటం సాంగ్


చిరంజీవి స్టాలిన్ లో ఐటం సాంగ్ (ప్రత్యేక నృత్యం)చేసినా ఆ తర్వాత వాటికి దూరంగా ఉండిపోయింది. తన ఇమేజ్‌కు తగిన సినిమాలు చేస్తూ విజయాలు సొంతం చేసుకుంటూ వస్తోంది.

సింగంతో తమిళంలో హవా...

సింగంతో తమిళంలో హవా...


తమిళంలో మాధవన్ సరసన ‘రెండు' చిత్రం ద్వారా పరిచయమైన ఆమె సూర్యతో చేసిన యముడు(సింగం)తో అక్కడివారికి ఆరాధ్య దేవతగా మారింది.

బాహుబలి 2లో...

బాహుబలి 2లో...


బాహుబలి 2లో అనుష్క ఇలా కనిపించబోతోంది.

సైజ్ జీరో..

సైజ్ జీరో..


సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X