టాలీవుడ్‌లో మరో కలకలం, ఆ వెబ్ సైట్‌లో హీరోయిన్స్‌తో పాటు యాంకర్స్ కూడా.. కంగుతిన్న నటి అపూర్వ!
Recommended Video

టాలీవుడ్ లో మరో కలకలం చోటు చేసుకుంది. అనేక వివాదాలతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పటికే సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ గురించి ఇటీవల వరకు చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ హీరోయిన్లు, యాంకర్స్ ఫోటోలు ఉపయోగించి డేటింగ్ బిజినెస్ సాగిస్తున్న దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ప్రముఖ నటి అపూర్వ కూడా బాధితురాలు కావడంతో ఆమె పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఈ వెబ్ సైట్ గురించి అపూర్వ సంచలన వాస్తవాలు వెల్లడించారు.

ఫోటో ఉంది అని చెప్పగానే
ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ లో తన ఫోటో ఉందని చెప్పగానే షాక్ అయ్యానని అపూర్వ చెబుతోంది. ఈ విషయాన్ని మొదటగా తన కజిన్ తెలియజేసినట్లు అపూర్వ తెలిపింది. దీనితో తాను వేంటనే పోలీస్ లని ఆశ్రయించి 20 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినట్లు అపూర్వ చెప్పుకొచ్చింది.

హీరోయిన్స్, యాంకర్స్ కూడా
ఈ వెబ్ సైట్ లో చాలా మంది టాలీవుడ్ హీరోయిన్స్, యాంకర్స్ ఫోటోలు కనిపించాయని అపూర్వ తెలిపింది. తమ ఫోటోలు అసభ్యంగా ఉపయోగించి వారు వ్యాపారం సాగిస్తున్నారని అపూర్వ ఆరోపించారు.

అదుపులోకి తీసుకున్న పోలీసులు
అపూర్వ ఫిర్యాదు చేయక ముందు నుంచే సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఆన్ లైన్ వెబ్ సైట్ పై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం నటి అపూర్వ కూడా వెళ్లారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, గతంలో ఎప్పుడూ చూడలేదని అపూర్వ తెలిపింది.

అలా కనిపించలేదు
ఆ వ్యక్తిని చూస్తే నేరం చేసే వాడిలా కనిపించలేదు. చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాడు. తన బ్లాక్ మెయిల్ చేసిన కొందరు ఈ క్రైమ్ లోకి దించారని అతడు వాపోయినట్లు అపూర్వ తెలిపింది. ఈ నేరపూరిత వ్యాపారం చేస్తూ వారు లక్షల్లో సంపాదన ఆర్జిస్తున్నారని అపూర్వ తెలిపింది.

వాళ్ళకి చెప్పాను
ఈ వెబ్ సైట్ లో ఫోటోలు ఉన్న కొందరి నటీమణులని ఫోన్ లో సంప్రదించానని అపూర్వ తెలిపింది. కానీ వారు ఏమి పట్టనట్టు వ్యవహరించారు. సైలెంట్ గా ఉంటె ఇలాంటి వాళ్ళు ఇంకా అధికం అవుతారని నటి అపూర్వ హెచ్చరించింది. అందరికి కుటుంబాలు ఉన్న సంగతి గుర్తు చేసుకోవాలని తెలిపింది.


Click it and Unblock the Notifications











