Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్‌పై వేటు!
- Lifestyle మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్‌లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్‌జున్‌వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
నా మేనేజర్లే నన్ను మోసం చేసారు, ఇండస్ట్రీ వారే అయినా నేను ఒప్పుకోలేదు: అర్చన
సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే నాకు ప్రపోజ్ చేశారు కానీ, వాళ్ల నిజాయతీ, నిబద్ధత గురించి అనుమానం వచ్చింది. నేను ఒప్పుకోలేదు అని చెప్పుకొచ్చింది అర్చన.
Recommended Video
బిగ్ బాస్ రియాల్టీ షోలో ఫైనల్ వరకు చేరుకున్న ఐదుగురిలో నటి అర్చన ఒకరు. ఈ ఐదుగురు సభ్యుల్లో బిగ్ బాస్ ఇంట్లో నెగెటివ్ అంశాలతో హాట్ టాపిక్ అయిన వ్యక్తి. ఇంటి నుండి బయకు వెళ్లిన వారిలో చాలా మంది అర్చన మీద రకరకాల కంప్లయింట్స్ చేసిన విషయం తెలిసిందే.
వస పిట్ట
అంతే కాదు.... బిగ్ బాస్ ఇంట్లో అత్యధిక సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయి, ఇంట్లో వస పిట్టగా పేరు తెచ్చుకున్న ఆమె తన సినిమాలకంటే ఈ షో ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. తన మేనేజర్ల కారణంగా సినిమాల్లో అవకాశాలు రాకుండా కొంత వరకు నష్టపోయిందట.
ఇబ్బందిపడ్డా
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నా మేనేజర్ల వల్ల నేను కొంత ఇబ్బందిపడ్డా. నేను తీసుకునే పారితోషికం గురించి ఇతర హీరోయిన్లకు చెబుతుండేవారు. దీంతో, అంతకన్నా తక్కువ పారితోషికానికి ఆయా హీరోయిన్లు లేదా నటీమణులు నాకు రావాల్సిన అవకాశాలను దక్కించుకునే వారు.
వారు దులిపేసుకునేవారు
నా ఫోన్ నెంబర్లు అవసరమైన వ్యక్తులకు నా మేనేజర్లు ఇచ్చేవారు కాదని నాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత నా మేనేజర్లను మందలించినా కూడా వారు దులిపేసుకునేవారు. పారితోషికం కన్నా స్క్రిప్ట్ బాగుంటే చేస్తానని నా మేనేజర్లకు నేను చెబుతుండేదానిని. కొన్నేళ్లుగా, నాకు మేనేజర్ ఎవరూ లేరు.
పెళ్లి చేసుకోవాలి కాబట్టి
నేనే, డైరెక్టుగా మాట్లాడుతున్నాను' అని అర్చన తెలిపింది. చాలా మంది పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటారని, తన ఆలోచనా విధానం మాత్రం అలా ఉండదని, మానసికంగా చూస్తే తాను చాలా స్ట్రాంగ్ గా ఉంటానని చెప్పింది. ‘అభద్రతా భావంతో ఉండను. ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న వ్యక్తిని నేను.
ఐ లవ్ మై సెల్ఫ్
నన్ను నేను చాలా గౌరవించుకుంటాను. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాల్యూ మై సెల్ఫ్. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటాను. సినిమా ఇండస్ట్రీలో నేను ఇంత వరకూ ఎవరికి ప్రపోజ్ చేయలేదు. వాస్తవం చెప్పాలంటే, నాకెవరైనా నచ్చితే వాళ్లకు ఇంకా దూరంగా ఉంటాను.
నేను ఒప్పుకోలేదు
సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే నాకు ప్రపోజ్ చేశారు కానీ, వాళ్ల నిజాయతీ, నిబద్ధత గురించి అనుమానం వచ్చింది. నేను ఒప్పుకోలేదు' అని చెప్పుకొచ్చింది. నిజానికి అందమూ నటనా రెండూ ఉన్నా సరైన ప్లానిగ్ లేకపోవటం, మంచి పాత్రలను చూసుకోకపోవటం వల్లనే వెనుకబడిపోయిందన్నది జనం అనుకునే మాట పాపం దానిక్కారణం మేనేజర్లన్నమాట.