కాబోయే వరుడితో చిందేసిన హీరోయిన్ అర్చన.. వైరల్ వీడియో

Recommended Video

కాబోయే వరుడితో చిందేసిన హీరోయిన్ అర్చన : వైరల్ వీడియో

అందాల తార అర్చన ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఇటీవలే గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్న అర్చన, జగదీష్ జంట.. తమ వివాహానానికి ముహుర్తం ఫిక్స్ చేసి హంగామా మొదలెట్టారు. నవంబర్ 14వ తేదీన వీళ్ళ వివాహం జరగనున్న సందర్బంగా సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ వివరాలు చూద్దామా..

గ్రాండ్‌ ఎంగేజ్మెంట్...

గ్రాండ్‌ ఎంగేజ్మెంట్...

గత కొంత కాలంగా పారిశ్రామిక వేత్త జగదీష్‌తో ప్రేమలో ఉన్న అర్చన అక్టోబర్ 3న అతనితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుకు బిగ్‌బాస్ హౌస్మేట్స్ హాజరయ్యారు. శివబాలాజీ, మధుమిత, నవదీప్, సుమంత్ లాంటి సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఇక పెళ్లి వేడుకను కూడా ఘనంగా జరుపుకునేందుకు అంతా సిద్ధం చేసింది అర్చన.

 సంగీత్.. కాబోయే వాడితో అర్చన ఎంజాయ్

సంగీత్.. కాబోయే వాడితో అర్చన ఎంజాయ్

అర్చన- జగదీశ్ పెళ్లి వేడుక హైదరాబాద్, గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో జరగనుంది. నవంబర్ 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహం జరగనుంది. ఈ సందర్బంగా సంగీత్ కార్యక్రమాన్ని ఆటపాటల నడుమ సందడిగా నిర్వహించారు. వధువరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు.

శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా

అర్చన స్నేహితులైన శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా ఈ కార్యక్రమంలో వధువరులతో పాటు ఆడిపాడారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ సంగీత్ కార్యక్రమంలో అర్చన, జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కూడా పాల్గొని సందడి చేశారు. ఈ పరిస్థితి చూస్తుంటే అర్చన వివాహ వేడుకలో మరింత మంది సెలెబ్రిటీల చిందులు చూడొచ్చని తెలుస్తోంది.

 పెళ్లి తర్వాత అర్చన?

పెళ్లి తర్వాత అర్చన?

అర్చన చివరగా సప్తగిరి చిత్రమైన వజ్రకవచధర గోవిందా చిత్రంలో నటించి మెప్పించింది. అయితే సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్న అర్చన పెళ్లి తరువాత పూర్తిగా దూరమవుతుందా? లేదా అన్నది చూడాలి. అల్లరి నరేష్ హీరోగా నటించిన నేను, సిద్దార్థ్-త్రిష కాంబినేషన్‌లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దాంటానా చిత్రంలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది అర్చన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X