twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంగరంగ వైభవంగా అర్చన పెళ్లి వేడుక.. శివ బాలాజీ, మంచు లక్ష్మి సందడి

    |

    హీరోయిన్ అర్చన వివాహం గురువారం (నవంబర్ 14న) ఘనంగా జరిగింది. పండితులు పెట్టిన ముహూర్తం తెల్లవారు జామున 1:30 నిమిషాలకు అర్చన మెడలో మూడు ముళ్ళు వేశారు హెల్త్‌కేర్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జగదీష్‌. ఇటీవలే గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్న అర్చన, జగదీష్ జంట కన్నుల పండుగగా జరిగిన పెళ్లి వేడుకతో ఒక్కటయ్యింది. ఆమె పెళ్లి సంగతులపై ఓ లుక్కేద్దామా..

     మేళ తాళాలు, పెద్దల ఆశీర్వాదాలు.. అంగరంగ వైభవంగా పెళ్లి

    మేళ తాళాలు, పెద్దల ఆశీర్వాదాలు.. అంగరంగ వైభవంగా పెళ్లి

    హైదరాబాద్, గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు, అర్చన సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖుల సందడి కనిపించింది. మేళ తాళాలు, పెద్దల ఆశీర్వాదాల నడుమ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు అర్చన దంపతులు.

    గతంలో నిశ్చితార్ధ వేడుక

    గతంలో నిశ్చితార్ధ వేడుక

    అక్టోబ‌ర్ 3వ తేదీన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో అర్చన‌, జగదీశ్‌ల నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుక కూడా ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఇక పెళ్ళికి ఒకరోజు ముందే అనగా నవంబర్ 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగగా.. నవంబర్ 14న అర్చన పెళ్లి వేడుక జరిగింది.

    శివ బాలాజీ దంపతులతో సహా మంచు లక్ష్మి

    శివ బాలాజీ దంపతులతో సహా మంచు లక్ష్మి

    అర్చన పెళ్లి వేడుకలో సినీ తారల సందడి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. శివబాలాజీ దంపతులు, మంచు లక్ష్మి, సుబ్బిరామి రెడ్డి, శుభలేఖ సుధాకర్, యాంకర్ ఓంకార్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, రాఘవేంద్ర రావు సహా ఎందరో సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

    సోషల్ మీడియాలో ఫొటోలు

    సోషల్ మీడియాలో ఫొటోలు

    ఇక అర్చన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో అర్చన దంపతులను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. ఈ సందర్బంగా అర్చనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

    సంగీత్ వేడుకలో డాన్సులు

    సంగీత్ వేడుకలో డాన్సులు

    మొన్న జరిగిన అర్చన సంగీత్ వేడుకలో ఆమె స్నేహితులైన శివబాలాజీ-మధుమిత దంపతులు వధూవరులతో పాటు ఆడిపాడారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ సంగీత్ కార్యక్రమంలో అర్చన, జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కూడా పాల్గొని డాన్సులు చేశారు.

    Recommended Video

    #CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
     బిగ్‌బాస్‌ కంటిస్టెంట్ సప్తగిరితో కలిసి..

    బిగ్‌బాస్‌ కంటిస్టెంట్ సప్తగిరితో కలిసి..

    తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించింది అర్చన. బిగ్‌బాస్‌ తెలుగు తొలి సీజన్‌లో కంటిస్టెంట్ గా పాల్గొన్న అర్చన.. ఇటీవల సప్తగిరి హీరోగా తెరకెక్కిన 'వజ్ర కవచధర గోవింద' చిత్రంలో కూడా ముఖ్య పాత్ర పోషించింది.

    English summary
    Actress Archana Veda Jagadeesh Marraige Ceremony done on 14th November. In this event Siva Balaji, Madhumitha, Manchu Lakshmi enjoyed lot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X