వేశ్యగా మారిన మరో తెలుగు హీరోయిన్
తాజాగా హీరోయిన్ అర్చన కూడా వెండితెరపై వేశ్యగా దర్శనం ఇవ్వబోతోంది. జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో రాబోతోన్న ఈచిత్రంలో ఆమె వేశ్య పాత్ర పోషించబోతోంది. ఈ చిత్రంలో హీరోగా శివాజీ నటించనున్నారు. గతంలో '1940లో ఒక గ్రామం' వంటి సామాజిక చిత్రాన్ని రూపొందించి నరసింహనంది జాతీయ అవార్డు దక్కించుకున్నారు.
తాజాగా ఆయన రూపొందించబోయే ఈ చిత్రం వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సందేశాత్మకంగా, సామాజిక అంశాలతో ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ చిత్రం షూటింగ్ మొత్తం వర్షంలోనే ఉంటుందట. హైదరాబాద్, రాజమండ్రి, డార్జిలింగ్, సిక్కిం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపనున్నారు. మేలో షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేయనున్నారు.
అల్లరి నరేష్ హీరోగా రూపొందిన 'నేను' చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన తెలుగు భామ అర్చనకు ఆ తర్వాత హీరోయిన్‌గా చేసిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో చిన్న సినిమాల్లో తప్ప స్టార్ హీరోలతో చేసే అవకాశం దక్కించుకోలేక పోయింది. ఆ తర్వాత ఆ అవకాశాలు కూడా తగ్గడంతో పలు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, ఐటం సాంగులు చేస్తూ కెరీర్ బండి లాగిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా అర్చన దశ తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications












