For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంగేజ్ మెంట్ చేసుకున్న అర్చన.. వరుడు ఎవరంటే..?

|

ఒకప్పటి హాట్ హీరోయిన్ అర్చన.. పెళ్లి చేసుకోబోతోంది. దాంతో ప్రస్తుతం సినీ జీవితానికి టాలీవుడ్ నటి అర్చన ముగింపు పలికేందుకు సిద్దమైంది. వ్యాపారవేత్త అయిన జగదీష్ అనే వ్యక్తిని పెళ్లాడేందుకు సిద్దమైంది. నేడు వీరిద్దరి హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగింది. గత కొద్దికాలంగా ప్రేమలో ఉందనే వార్తలకు ఈ నిశ్చితార్థంతో తెర దించింది. ఎంతో వైభవంగా జరిగిన అర్చన నిశ్చితార్థ వేడుకకు సీనీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బిగ్ బాస్ హౌస్ మిత్రులు ప్రత్యక్షమయ్యారు.

జంటగా హాజరైన శివబాలాజీ

జంటగా హాజరైన శివబాలాజీ

అత్యంత సన్నిహితులు, స్నేహితులు మధ్య ప్రైవేట్‌గా జరిగిన అర్చన నిశ్చితార్థ వేడుకకు బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ శివబాలాజీ హాజరయ్యారు. ఆయన తన సతీమణి మధుమితతో కలిసి ఈ ఈవెంట్ కు విచ్చేశాడు.

అభినందనలు నవదీప్, సుమంత్

అభినందనలు నవదీప్, సుమంత్

టాలీవుడ్ యంగ్ యాక్టర్, అక్కినేని హీరో సుమంత్ ఈ వేడుకకు హాజరై.. అర్చనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆశీర్వదించిన అర్చన తల్లిదండ్రులు

ఆశీర్వదించిన అర్చన తల్లిదండ్రులు

అర్చన తల్లిదండ్రులైన విజయ శాస్త్రి, సుధాకర్ శాస్త్రి.. జగదీష్ తల్లిదండ్రులు ప్రతిభ, భక్తవత్సలం కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఇక పలువురు ప్రముఖలు, బంధువులు ఈ వేడుకకు హాజరై అర్చన, జగదీష్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

కుర్రకారు హీటెక్కించిన భామ

కుర్రకారు హీటెక్కించిన భామ

తన అందంతో కుర్రకారు హీటెక్కించిన ఈ భామ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటుంది. బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొని వార్తల్లో నిల్చింది. అయితే బిగ్ బాస్ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినీ జీవితానికి అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషించింది.

English summary
Actress Archana Veda Engagement with Jagadeesh (Vice – President (V.P) of Leading Healthcare Company) took place today on 3rd October, 2019 at Hotel Radisson Blu – Banjara Hills.The Engagement Ceremony had the presence of Actor Sumanth – Actor Navdeep – Actor Shiva Balaji - Actress Madhumita & other relatives of Archana Veda & Jagadeesh.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more