నటి అర్చన పెళ్లికి ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ అంటే..?
నటి అర్చన పెళ్లి ముహుర్తం ఖరారైంది. ఇటీవలె గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్న అర్చన, జగదీష్ జంట.. వివాహానానికి ముహుర్తం ఫిక్స్ అయింది. 2004లో నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అర్చనకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. క్రమ క్రమంగా సైడ్ హీరోయిన్ పాత్రలకు ఫిక్స్ అయిన అర్చన బిగ్ బాస్ షోతో మళ్లీ వెలుగులోకి వచ్చింది.

గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్...
బిగ్ బాస్ తెలుగు సీజన్-1లో అర్చన అందాల ఆరబోతను అంత తొందరగా మరిచిపోలేరు. గత కొంత కాలం నుంచి జగదీష్ అనే యువకుడితో ప్రేమలో ఉన్న సంగతి అందరకీ తెలిసిందే. అక్టోబర్ 3న ఈ జంటకు నిశ్చితార్థం కాగా.. ఈ వేడుకు బిగ్‌బాస్ హౌస్మేట్స్ హాజరయ్యారు. శివబాలాజీ, మధుమిత, నవదీప్, సుమంత్ లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు.

పెళ్లి తేదీ ఫిక్స్..
వ్యాపార వేత్త అయిన జగదీష్‌ను అర్చన నవంబర్ 13న పెళ్లాడబోతోంది. ఈ విషయాన్ని అర్చన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. హైదరాబాద్‌లో జరుగనున్న ఇక ఈ వేడుకు బంధుమిత్ర సపరివారమంతా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ మొదటి సీజన్ సభ్యులతో పాటు, సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.

చివరగా కనిపించిన చిత్రం..
అర్చన చివరగా సప్తగిరి చిత్రమైన వజ్రకవచధర గోవిందా చిత్రంలో నటించి మెప్పించింది. అయితే సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్న అర్చన పెళ్లి తరువాత పూర్తిగా దూరమవుతుందా? లేదా అన్నది చూడాలి. అల్లరి నరేష్ హీరోగా నటించిన నేను, సిద్దార్థ్-త్రిష కాంబినేషన్‌లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దాంటానా చిత్రంలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











