Drugs Case: డ్రగ్స్ కేసుపై అషు రెడ్డి పోస్ట్.. మొత్తం చెప్పేస్తా.. అది చూపిస్తే ఊరుకోను అంటూ!

సినీ రంగాన్ని డ్రగ్స్ కేసులు వదలడం లేదు. చాలా మంది సినీ ప్రముఖులు, వాళ్లతో సంబంధం ఉన్న వాళ్లు తరచూ నిషేదిత ఉత్ప్రేరకాలను వాడడం.. పోలీసులకు చిక్కడం వంటివి జరుగుతున్నాయి. దీంతో తరచూ ఈ తరహా కేసులు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతూనే ఉన్నాయి.

ఇలా ఇటీవలే ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలోనే అషు రెడ్డి పేరు కూడా హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం!

Actress Ashu Reddy Clarity About Drugs Case

కేపీ చౌదరితో వాళ్లకు లింకు: టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా అతడి రిమాండ్ రిపోర్టులో ఏకంగా 12 మంది సినీ, రాజకీయ, పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. వీళ్లందరికీ అతడు డ్రగ్స్ అమ్మినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. అలాగే, కొందరు డ్రగ్స్ పెడ్లర్లతోనూ కేపీ చౌదరికి సంబంధం ఉన్నట్లు చెప్పాడట.

నాలుగు ఫోన్లు.. 9000 పిక్స్: కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన తర్వాత అతడికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ నిర్మాతకు చెందిన నాలుగు సెల్‌ఫోన్లలో తీసుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక, కేపీ చౌదరికి సంబంధించిన గూగుల్ డ్రైవ్‌లో ఏకంగా 9000 ఫొటోలు ఉన్నట్లు తెలిసింది. అవన్నీ ప్రముఖులతో దిగినవే అనే టాక్ వినిపిస్తోంది.

సినీ సెలెబ్రిటీలతో లింక్స్: కేపీ చౌదరి ఫోన్‌లో లభించిన ఫొటోల ఆధారంగా ఆయనకు చాలా మంది సినీ సెలెబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన పలువురితో వందకు పైగా ఫోన్ కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ లిస్టులో అషు రెడ్డి, సురేఖ వాణి, జ్యోతిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడీ కేసు టాలీవుడ్‌లో కలకలం రేపుతుంది.

Actress Ashu Reddy Clarity About Drugs Case

పరోక్షంగా స్పందించింది: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కేపీ చౌదరి కాల్ డేటా ఆధారంగా అషు రెడ్డి పేరు హైలైట్ అవుతోంది. అలాగే, వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు కూడా వైరల్ అవుతోన్నాయి. దీంతో అషుకు ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసుపై ఆమె సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Actress Ashu Reddy Clarity About Drugs Case

ఆ వార్తలు ఖండిస్తున్నా: డ్రగ్స్ కేసులో తన పాత్ర ఉన్నట్లు వస్తున్న వార్తలపై బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 'కొంత మంది వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నట్లు మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ, ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఈ పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది.

Actress Ashu Reddy Clarity About Drugs Case

నా నెంబర్ చూపకండి: అదే పోస్టులో అషు రెడ్డి.. 'ఈ విషయంలో అవసరమైతే విచారణ ఎదుర్కొంటాను. సంబంధిత అధికారులకు వాస్తవాలు ఏమిటో తెలియజేస్తాను. అలాగే, మీడియాలో నా ఫోన్ నెంబర్‌ను కొందరు చూపిస్తూ ప్రసారం చేస్తున్నారు. అది వెంటనే ఆపకపోతే అస్సలు సహించేది లేదు' అంటూ వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ స్పందనతో అయినా అషు రెడ్డిపై వార్తలు ఆగుతాయేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X