కుర్ర హీరోయిన్ బర్త్ డే పార్టీ...జాలీగా (ఫోటోలు)
హైదరాబాద్: 'చిన్నారి పెళ్లి కూతురు'గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచతమైన ముంబై బ్యూటీ అవికాగోర్ తెలుగులో వచ్చిన 'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. తొలి సినిమా హిట్ కావడంతో అమ్ముడికి మరిన్ని అవకాశాలు సైతం వచ్చాయి. తెలుగులో ఆమె 'లక్ష్మీరావే మా ఇంటికి' అనే చిత్రంలోనూ నటిస్తోంది. దీంతో పాటు 'కేర్ ఆఫ్ ఫుట్ పాత్ 2' అనే కన్నడ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.
'ఉయ్యాలా జంపాలా' సినిమా స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ఇటీవల ముంబైలో ఆమె బర్త్ వేడుక నిర్వహించారు. బాలికావధు సీరియల్(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు)టీం, యువ భారత్ ఎక్స్‌ప్రెస్ మేగజైన్ టీం ఆధ్వర్యంలో ఈ బర్త్ డే వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఆమెను అంతా శుభాకాంక్షలు, గిఫ్టులతో ముంచెత్తారు.
స్లైడ్ షోలో బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలు....

అవికా గోర్
అవికా గోర్ బర్త్ డే వేడుకలో భాగంగా కేక్ కట్ చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

గుజరాతీ భామ
అవికాగోర్ గుజరాతీ ఫ్యామిలీకి చెందిన భామ. ఆమె తండ్రి సమీర్ గోర్ ఇన్వెస్టిమెంట్ అండ్ ఇన్యూరెన్స్ ఏజెంట్. ఆమె తల్లి చేతన్ గోర్ హౌస్ వైఫ్.

ముంబైలో
అవికాగోర్ ఫ్యామిలీ ముంబైలో స్థిరపడ్డారు. ముంబైలోని రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆమె చదువుకున్నారు.

చిన్నతనం నుండే...
అవికా గోర్ చిన్నతనంలోనే ఈ రంగంలోకి ప్రవేశించింది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు ఫ్యాషన్ షోలలో పాల్గొంది. పదేళ్ల వయసులోనే లాక్మే ఫ్యాషన్ వీక్ జినీ అండ్ జానీ విభాగంలో బెస్ట్ మోడల్ అవార్డు గెలుచుకుంది.

హీరోయిన్‌గా బిజీ...
ఉయ్యాలా జంపాలా చిత్రం విజయం సాధించడంతో ఆమె హీరోయిన్‌గా బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో ‘లక్ష్మీ రావె మా ఇంటికి' అనే చిత్రంతో పాటు కన్నడలో ‘కేరాఫ్ ఫుట్ పాత్ 2' చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











