నిర్మాతను పెళ్లాడబోతున్న హీరోయిన్ భావన?
హైదరాబాద్: తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో నటించిన మళయాల బ్యూటీ భావన పెళ్లి వార్తలు ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. గత కొంత కాలంగా రహస్య వ్యక్తితో డేటింగ్ చేస్తోందని, అతనితో ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఆ మధ్య ఆమె ఈ వార్తలపై కూడా స్పందించింది. ఒక వ్యక్తితో గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 'గత రెండు సంవత్సరాల నుండి ఒకరితో రిలేషన్‌షిప్ మెయింటేన్ చేస్తున్నాను. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం మాత్రం లేదు. ఆ వ్యక్తి వివరాలు ఇప్పుడే బయట పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. నా పర్సనల్ విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుతం నా ఫోకస్ అంతా ఇప్పటి వరకు కమిటైన చిత్రాలు పూర్తి చేయడంపైనే ఉంది' అని భావన వెల్లడించింది.

కాగా...ఆ వ్యక్తి ఎవరో భావన బయట పెట్టక పోవడంతో పలు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. అతను కన్నడ సినీ నిర్మాత నవీన్ అనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి 'రోమియో' అనే కన్నడ చిత్రానికి కలిసి పని చేసారు. తన పేరు బయటకు రావడంపై నవీన్ కాస్త కంగారు పడ్డారు. వెంటనే మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నాడు. భావన, నేను స్నేహితులం మాత్రమే. అందుకు మించి మరేమీ లేదు. 'రోమియో' చిత్రం దగ్గర నుండి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మధ్యలో కొన్ని సార్లు కలిసి ఇతర ప్రాజెక్టుల గురించి కూడా చర్చించాం. మేమిద్దరం డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు ఎలా ప్రచారంలోకి వచ్చాయో అర్థం కావడం లేదు అని నవీన్ తెలిపారు.
అయితే మీడియాలో మాత్ర భావన పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నవీనే అంటున్నారు. ముందుగానే ఈ విషయం బయట పెడితే అనవసర ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతో విషయం రహస్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు భావన పెళ్లి విషయమై స్పందిస్తూ 2015 జనవరిలో సోదరుడి పెళ్లయిన తర్వాత భావన వివాహం ఉంటుందని అంటున్నారు. కానీ ఎవరితో ఆమె పెళ్లి ఉంటుందనే విషయం మాత్రం చెప్పడం లేదు.


Click it and Unblock the Notifications











