ఎన్టీఆర్ భాదని అర్థం చేసుకోగలను.. హీరోయిన్ భూమిక!
నందమూరి హరికృష్ణ అకాల మరణం అందరిని షాక్ కు గురిచేస్తోంది. సినీనటి భూమిక హరికృష్ణ మరణం పట్ల సంతాపం తెలియజేశారు. హరికృష్ణ అకాల మరణం గురించి తెలుసుకుని షాక్ అయ్యా అని భూమిక ట్విట్టర్ లో స్పందించింది. ఆయన గురించి వ్యక్తిగతంగా నాకు తెలియదు. ఎన్టీఆర్ తండ్రిగా తెలుసు.
ఈ సమయంలో జూ. ఎన్టీఆర్ ఎలాంటి భాదని అనుభవిస్తున్నారో అర్థం చేసుకోగలను. ఇటీవల నా తల్లి కూడా మరణించింది అని భూమిక తెలిపింది. హరికృష్ణ కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు భూమిక తెలిపింది.

ఈ సందర్భంగా తాను ఎన్టీఆర్ తో కలసి రెండు చిత్రాల్లో నటించానని భూమిక గుర్తు చేసుకుంది. ఎన్టీఆర్, భూమిక కలసి సింహాద్రి, సాంబ చిత్రాలలో నటించారు. కాగా ప్రస్తుతం హరికృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వంలాంఛనాలతో జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో జరుగుతున్నాయి.
More from Filmibeat
nandamuri harikrishna death nandamuri harikrishna rip nandamuri harikrishna jr ntr news kalyan ram ntr balakrishna chandrababu tollywood janaki ram death nandamuri harikrishna funeral నందమ


Click it and Unblock the Notifications











