»   »  నకిలీ నోట్ల తో పట్టుబడ్డ నటి., మరికొందరు సినీ ప్రముఖుల కోసం గాలింపు

నకిలీ నోట్ల తో పట్టుబడ్డ నటి., మరికొందరు సినీ ప్రముఖుల కోసం గాలింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడ చిత్రాల్లో క్యారెక్టర్ ఆరిస్ట్ గా రాణిస్తున్న ఓ నటి నకిలీ 2 వేల నోట్లని చలామణి చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఆమె వద్ద భారీ స్థాయిలో 2 వేల నోట్లను కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం దబాస్ పేట వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...

కన్నడ నటి జయమ్మ

కన్నడ నటి జయమ్మ

నకిలీ నోట్ల చెలామణి కేసులో కన్నడ నటి జయమ్మని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కర్ణాటకలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ షాపు వ‌ద్ద‌కు వచ్చి రూ.2 వేల నకిలీనోట్లు చెలామణి చేయ‌డానికి ప్ర‌య‌త్నించగా, అనుమానం వచ్చిన షాపు యజమాని ఆమెను ప్రశ్నించగా ఆమె అక్క‌డి నుంచి పారిపోవాల‌ని చూసింది. దీంతో ఆయ‌నతో పాటు స్థానికులు ఆమెను వెంబ‌డించి ప‌ట్టుకున్నాడు. ఆమె వద్ద భారీగా న‌కిలీ నోట్లు ఉన్న‌ట్లు గుర్తించారు

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌

కన్నడ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన జయమ్మ గురువారం డాబస్‌పేటే వద్ద రూ. 2 వేల నకిలీనోట్లు చెలామణి చేస్తుండగా అనుమానం వచ్చిన ఓ షాపు యజమాని ఆమెను ప్రశ్నించాడు. దీనితో జయమ్మ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆమెని స్థానికులు వెంబడించాడు ప్రయత్నించగా వారికి చిక్కింది. దీనితో జయమ్మని స్థానిక పోలీస్ లకు అప్పగించారు.

నిర్మాతలు, కొందరు నటులు కూడా

నిర్మాతలు, కొందరు నటులు కూడా

రంగంలోకి దిగిన పోలీసులు ఈ నకిలీ నోట్ల వ్యవహారం వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. పోలీసులు ఆ న‌టితో పాటు ఆమెకు స‌హ‌క‌రిస్తున్న‌ ఆటోడ్రైవరు గోవిందరాజు అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. వారు మాత్ర‌మే కాదు నిర్మాతలు, కొందరు నటులు కూడా నకిలీనోట్లు చెలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

సుదీప్, ఉపేంద్ర

సుదీప్, ఉపేంద్ర

జయమ్మ సెల్‌ఫోన్‌ ఆధారంగా ఈ కేసులో ద‌ర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ లు ఆమె వద్ద భారీ స్థాయిలో నకిలీ నోట్లని స్వాధీనం చేసుకున్నారు. ఆమెని విచారించగా కొందరు నిర్మాతలు, సినీ ప్రముఖులు కూడా దొంగ నోట్లని చలామణి చేస్తున్నట్లు తెలిసింది. పోలీస్ లు ఆమె ద్వారా మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె వద్ద నుంచి 24 నకిలీ రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సుదీప్, ఉపేంద్ర సినిమాల్లో జయమ్మ సహాయనటి పాత్రలు పోషించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

English summary
Supporting actress in Kannada films, Jayamma was handed over to the police when she was trying to make a transaction with fake Rs 2000 notes near Dabaspet, Nelamangala in the outskirts of Bengaluru.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu