twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీక్రెట్‌గా డైరెక్టర్‌తో హీరోయిన్ నిశ్చితార్థం.. షోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

    |

    సినీ తార, టెలివిజన్ నటి చైత్రారెడ్డి త్వరలోనే పెళ్లికూతురు కాబోతున్నది. యువ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రాకేష్ సామలను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. గత కొద్దికాలంగా చైత్రారెడ్డి, రాకేష్ ప్రేమ వ్యవహారం మీడియాలో నానుతున్నది. తాజాగా జరిగిన ఎంగేజ్‌మెంట్‌తో ఆ వార్తలకు చైత్రా, రాకేష్ బ్రేక్ వేశారు. అత్యంత నిరాడంబరంగా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జరిగిన పెళ్లి నిశ్చితార్థం గురించి మరింత సమాచారం..

    రాకేష్‌తో రిలేషన్ గురించి

    రాకేష్‌తో రిలేషన్ గురించి

    కల్యాణ ముదల్ కాద్ వారై అనే సీరియల్‌తో చైత్రారెడ్డి తమిళ టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. యారాడి నీ మోహిని‌ సీరియల్‌తో చైత్రారెడ్డి మంచి గుర్తింపు పొందారు. తన నటనతో అత్యధికంగా మహిళా అభిమానులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు. గత మార్చిలో రాకేష్ సామలతో ప్రేమలో ఉన్నట్టు ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో సంకేతిలిచ్చారు. ఆ తర్వాత వారి రిలేషన్ గురించి మీడియాలో ఊహగానాలు మొదలయ్యాయి.

     సీక్రెట్‌గా నిశ్చితార్థం.. సోషల్ మీడియాలో ఫొటోలు

    సీక్రెట్‌గా నిశ్చితార్థం.. సోషల్ మీడియాలో ఫొటోలు

    ఇక చైత్రారెడ్డి నిశ్చితార్థం రాకేష్‌తో జరగడం సినీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సీక్రెట్‌గా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకొని షాకిచ్చినంత పని చేశారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ కావడంతో మీడియా దృష్టికి ఈ విషయం వచ్చింది.

    సంప్రదాయ దుస్తుల్లో చైత్రారెడ్డి, రాకేష్ సామల

    సంప్రదాయ దుస్తుల్లో చైత్రారెడ్డి, రాకేష్ సామల

    పసుపు పచ్చని చీరలో చైత్రారెడ్డి అందంగా మెరిసిపోతూ కనిపించింది. రాకేష్ సామల సంప్రదాయంగా దుస్తుల్లో కనిపించారు. చేతికి ఉంగరాన్ని తొడిగి చైత్రారెడ్డితో జీవితాన్ని ఆరంభించడానికి తొలి అడుగు వేశాడు. ఈ వివాహా నిశ్చితార్థానికి చైత్రారెడ్డి స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు.

     నా జీవితానికి గొప్ప ఆరంభం

    నా జీవితానికి గొప్ప ఆరంభం

    చైత్రారెడ్డితో జరిగిన నిశ్చితార్థం గురించి రాకేష్ సామల తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెడుతూ.. జీవితంలో తారసపడిన ఓ కొత్త వ్యక్తితో ఎన్నో విషయాలను మొదలుపెట్టవచ్చు. ఆ సంఘటన ఆ వ్యక్తికి అద్భుతంగా ఆరంభం కావొచ్చు. భవిష్యత్‌లో గొప్ప అనుభూతిని పొందుతానని నమ్మకం ఏర్పడింది. అంతేకాకుండా మంచి వ్యక్తి అవుతాననే భావన కలిగింది అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.

    Recommended Video

    Star Heros Special Target On Dussehra Holidays
    చైత్రారెడ్డి, రాకేష్ సామల

    చైత్రారెడ్డి, రాకేష్ సామల

    చైత్రారెడ్డి కెరీర్ విషయానికి వస్తే.. కన్నడలో అవును మాతే శ్రావణి షోతో నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రగ్గడ్ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్ర రంగాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నారు. పెళ్లితో మరో కొత్త జీవితానికి తెర లేపారు. రాకేష్ సామల అనగనగా ఒక నాన్న లాంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

    English summary
    Actress Chaitra Reddy engaged to cinematographer Rakesh Samala. Rakesh Samala shared that One can begin so many things with a new person! - even begin to be a better man. I promise to be a better man for us to have a great experience in coming future.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X