డబ్బు తీసుకుని నిర్మాతకు హ్యాండిఃచ్చిన హీరోయిన్
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ప్రొడ్యూసర్లు, నిర్మాతలు చెప్పినట్లు నడుచుకుని బుద్దిగా ప్రవర్తిస్తుంటారు హీరోయిలు, హీరోయిన్ల. కాస్త పాపులర్ కాగానే కొంత మందికి పొగరు తలకెక్కుతుంది. డబ్బులు పెట్టి సినిమాలు తీసే నిర్మాత మాటకు అస్సలు విలువ ఇవ్వరు. డబ్బు చేతికి ముట్టగానే వాళ్లనే తమ చుట్టూ గింగిరాలు కొట్టించుకుంటుంటారు. ఇలాంటి కోవలోకే వస్తుంది మల్లు బ్యూటీ మీరా జాస్మిన్. ఈ విడ 'మోక్ష" అనే సినిమాలో లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రిలీజ్‌కు ముందే అమ్మడు తనకు రావాల్సిన ఫుల్ అమౌంట్ రూ. 40 లక్షలు నిర్మాత నుంచి రాబట్టింది. త్వరలో ఈ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఈ మేరకు సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే సరికి మీరా జాస్మిన్ నిర్మాతకు హ్యాండిచ్చింది. ప్రమోషన్లకు రావడం తనకు కుదరదని తెగేసి చెప్పిందట.
మెయిన్ హీరోయిన్ లేకుండా ప్రమోషన్లు నిర్వహిస్తే జనాలు అస్సలు పట్టించుకునే అవకాశమే లేదు. దీంతో ఏం చేయాలో తోచక నిర్మాత తలపట్టుకు కూర్చున్నాడు. ఆమెను కాకుండా ఇంకెవరైనా హీరోయిన్‌తో సినిమా తీసి ఉంటే ఇప్పడు ఇన్ని కష్టాలు ఉండే కాదు కదా అని బాధపడుతున్నాడట పాపం ఆ పిచ్చి ప్రొడ్యూసర్.


Click it and Unblock the Notifications











