‘బూమ్ బూమ్’లో హాలీవుడ్ హీరోయిన్
హైదరాబాద్: భరత్ భూషణ్, రీతూ హీరో హీరోయిన్లుగా చలపతి సినీ ఫిలిమ్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో టి.చలపతి నిర్మిస్తున్న చిత్రం ‘బూమ్ బూమ్'. ఈ చిత్రంలో హాలీవుడ్ నటి చాచా పతుమ్‌తిప్ మరో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరులో ఆడియో పంక్షన్ జరుపుకోనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత టి. చలపతి మాట్లాడుతూ...‘తమ స్వార్థం కోసం మనుషులు ఎలా మారిపోతున్నారనే కాన్సెప్టుని ప్రధానంగా తీసుకుని ఈ ‘బూమ్ బూమ్' అనే చిత్రం తెరకెక్కించడం జరిగింది. ఫారిన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. చాచా పతుమ్‌తిప్ అనే హాలీవుడ్ నటి నటించినట్లు తెలిపారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

చాచా పతుమ్‌తిప్
ఈ చిత్రంలో ‘ది వన్ (థాయ్ ఫిల్మ్), ఐస్ లాండ్ ఆఫ్ లక్ (రష్యన్ ఫిల్మ్), ఆల్ట్రా (రష్యన్ ఫిల్మ్), రుక్ ప్యాడ్ పుయ్ (పాడటంతో పాటు నటించిన థాయ్ ఫిల్మ్)' వంటి చిత్రాల్లో నటించిన చాచా పతుమ్‌తిప్ నటించింది.

హైలెట్
చాచా పతుమ్‌తిప్ అనే హాలీవుడ్ నటి అనే హాలీవుడ్ నటి చక్కని నటన ఈ చిత్రానికే హైలెట్ గా ఉంటుంది.

చిత్రీకరణ విశేషాలు
మలేషియా, థాయ్ లాండ్, సింగపూర్ మొదలగు పట్టణాల్లో పాటల చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఆడియోని ఈ నెలాఖరుకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. అలాగే సినిమాను డిసెంబరు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని సిద్ధం చేస్తున్నాము' అన్నారు.

నటీనటులు, టెక్సీషియన్స్
నరేంద్ర, లంకా సతీష్, బాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, నిర్మాత: టి.చలపతి, కథ-మాటలు-దర్శకత్వం: నగేష్ నారదాసి.


Click it and Unblock the Notifications