'రెబెల్' ప్లాప్ గురించేనా దీక్షాసేధ్ అలా??

By Srikanya

హైదరాబాద్ : ''తొలి దశలో ఎవరికైనా ఈ తరహా పాత్రలే దక్కుతాయి. అనుష్కకీ 'అరుంధతి'లాంటి కథ దొరకడానికి కొంత సమయం పట్టింది. అంతెందుకు? కరీనా కపూర్‌కి కూడా 'జబ్‌ వుట్‌ మెట్‌' సినిమాకి ముందు సాధారణ పాత్రలే దక్కాయి. ముందు దర్శకుడు హీరోయిన్ ని నమ్మాలి. ఈ పాత్ర చేయగలదు' అనే విశ్వాసం ఆయనకు కలగాలి. అప్పుడే నటించే అవకాశం మాకూ దక్కుతుంది. నేను ఎలాంటి పాత్రకైనా న్యాయం చేస్తాను. ప్రస్తుతానికి కథకేం కావాలో అదే చేస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చింది దీక్షాసేధ్.

ఈ స్టేట్ మెంట్ విన్నవారు..రెబెల్ ఫెయిల్యూర్ తో చాలా డీలా పడింది దీక్షాసేధ్ అంటున్నారు. ఆమె ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఆ సినిమా మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీక్షాసేధ్ ఈ చిత్రంలో సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో కనపడుతుంది. అయితే ఆమె ఉండే కాస్సేపు..ముసలి గెటప్ లో డాన్స్ టీచర్ గా చూపెట్టాడు దర్సకుడు లారెన్స్. కామెడీ కోసం అలా పెట్టినా ఆమె చాలా డీగ్లామర్ గా కనిపించింది. దాంతో ఆమె చాలా భాదపడుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఇక..''అవకాశం ఇస్తేనే ఎవరి ప్రతిభ బయటపడుతుంది. నేను కేవలం అలాంటి పాత్రలే చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. నా దగ్గరకు వచ్చే దర్శకులంతా నన్ను అందంగా చూపించాలనే అనుకొంటున్నారు. 'అరుంధతి'లాంటి కథ దొరికింది కాబట్టి.. అనుష్కలో మంచి నటి ఉందనే విషయం తెలిసింది. నాకూ అలాంటి కథ దొరికితే.. బాగుణ్ను'' అంటోంది దీక్షాసేథ్‌. త్వరలోనే తమిళంలో ఓ పవర్‌ఫుల్ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో దీక్ష నటించనుందని చెప్పింది. ఇటీవల ఓ తమిళ చానల్‌లో ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఈ విషయాన్ని దీక్ష ప్రస్తావించారు .

అలాగే మొదట్నుంచీ యాక్షన్ సినిమాలంటే ఇష్టం. కత్తి పట్టుకుని యుద్ధం చేయాలంటే ఇంకా ఇష్టం. అలాంటి పాత్ర ఎవరైనా ఆఫర్ చేస్తే... రిస్కీ స్టంట్స్ చేయడానికి కూడా నేను వెనుకాడను. లైఫ్‌లాంగ్ నిలిచిపోయే అరుంధతి లాంటి పాత్రను చేయాలని ఉంది. నా కల నిజమయ్యే రోజులు త్వరలోనే ఉన్నాయ్ అని చెప్పుకొచ్చింది. తెలుగులో ప్రభాస్‌ సరసన రెబల్ లోను, రవితేజకు జోడీగా నిప్పు చిత్రంలోను, మంచు మనోజ్ చిత్రం ఊ కొడతారా ఉలిక్కి పడతారా లోనూ, గోపీచంద్ సరసన వాంటెడ్ లో చేసింది. అయితే ఆ సినిమాలేమీ ఆడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X