కప్ప గుడ్లోడా.. బూతు సినిమాలోడా.. దమ్ముంటే ఆ సినిమా తీయ్: వర్మకు సవాల్

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఇటీవల విజయవాడలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మా సినిమాపై కక్షకట్టిన కొందరు తమకు ఎవరూ హోటల్స్ అద్దెకు ఇవ్వకుండా ఆయా యాజమాన్యాలను బెదిరించారని, అందుకే పైపుల రోడ్డులో నడిరోడ్డుపై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. వర్మ ప్రకటనతో అలర్ట్ అయిన పోలీసులు ఆయన్ను గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలోనే అడ్డుకుని తిరిగి హైదరాబాద్ పంపించేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వర్మ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్జీవికి కౌంటర్ ఇస్తూ.. నటి, టీడీపీ మహిళనేత దివ్యవాణి రంగంలోకి దిగారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో అన్నీ అబద్దాలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో అన్నీ అబద్దాలు

రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో చూపించిన విషయాలన్నీ అవాస్తవాలే అని దివ్యవాణి ఆరోపించారు. ఇందులో వాస్తవాలను వక్రీకరించి చూపించారంటూ ఆమె తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరని తెలిపారు.

వర్మ బూతు చిత్రాలు తీసే డైరెక్టర్

వర్మ బూతు చిత్రాలు తీసే డైరెక్టర్

రామ్ గోపాల్ వర్మ బూతు సినిమాలు తీసే దర్శకుడని, అలాంటి వ్యక్తికి ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడిపై సినిమా తీసే అర్హత లేదు అంటూ దివ్యవాణి విరుచుకుపడ్డారు. లక్ష్మీ పార్వతి ఎలాంటి వ్యక్తో ఆమె మొదటి భర్త వీరగంధం సుబ్బారావు ఎప్పుడో చెప్పారన్నారు.

నీ కప్పగుడ్లు పీకేస్తారు జాగ్రత్త

నీ కప్పగుడ్లు పీకేస్తారు జాగ్రత్త

దేవుడు, దెయ్యం లేదని చెప్పే వర్మ... ఎన్టీఆర్ ఆత్మ వచ్చి సినిమా తీయమని చెప్పిందంటూ కల్లబొల్లి మాటలు చెబితే ఎవరూ నమ్మరని తెలిపారు. మహిళలను కించ పరిచే సినిమాలు తీసిన నీ కప్పగుడ్లను తెలుగింటి మహిళలు, ఆడపడుచులు పీకి పారేసి కళ్లులేని కబోదిని చేస్తారని హెచ్చరించారు.

దమ్ముంటే ఆ సినిమా తీయ్

దమ్ముంటే ఆ సినిమా తీయ్

నీకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరిగిన హత్యపై సినిమా తీయ్, అనవసరంగా మా నాయకుడిని ఒక మాట అనొద్దు, తిరిగి మొహాన ఉమ్మి వసే విధంగా వంద మాటలు అనిపించుకోవద్దు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మీరు ఇతర రాష్ట్రాల్లో విడుదల చేస్తే ప్లాప్ అయి సంకనాకి పోయిందని అందరికీ తెలుసు... అంటూ దివ్యవాణి ఫైర్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X