అలీని నరికేయాలనేంత కోపంతో సుమ.. కానీ ఏం చేయగలదు.. నటి దివ్యవాణి!

స్టార్ కమెడియన్ అలీ, ప్రముఖ యాంకర్ సుమపై చేసిన ఇటీవల లవర్స్ డే ఆడియో వేడుకలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మీడియా సంస్థల్లో అలీ వ్యాఖ్యలు హాట్ హాట్ డిబేట్ గా మారుతున్నాయి. గతంలో అలీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగింది. అయినా కూడా అలీతో మార్పు రాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఓ మీడియా సంస్థలో సుమపై అలీ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన నటి దివ్యవాణి, సీనియర్ నటి కవిత ఆలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏం జరిగిందంటే

ఏం జరిగిందంటే

ఇటీవల యూట్యూబ్ సంచలనం నటించిన లవర్స్ డే ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఆడియో వేడుక కోసం సుమతో పాటు అలీ కూడా యాంకర్ గా మారాడు. అలీ, సుమ వేదికపై ఉంటే ఎం జరుగుతుందో మనందరికీ తెలుసు. అలీ తనదైన శైలిలో కామెడీ పంచులు పేల్చుతుంటాడు. ఈ వేడుకలో కూడా అదే జరిగింది. సుమ, అలీ మధ్య జరిగిన సంభాషణ కాస్త మిస్ ఫైర్ అయి వివాదంగా మారింది.

డబుల్ మీనింగ్ పంచ్

డబుల్ మీనింగ్ పంచ్

ఆడియో వేడుకలో మలయాళీ ప్రముఖ ప్రసంగాలనిసుమ తెలుగులో వివరించే ప్రయత్నం చేసింది. నేను కూడా మలయాళంలో మాట్లాడతా.. దాన్ని తెలుగులోకి మార్చు అంటూ అలీ సరదాగా మాట్లాడాడు. సుమ కూడా ఫన్నీగా.. అలీ ఏమంటున్నారంటే.. ప్రియవారియర్ నా చెల్లెలు లాంటిది అని అంటున్నారని జోకులు వేసింది. కొంత సమయం తర్వాత అలీ మాట్లాడుతూ.. సుమ కొడుకు పేరు రోషన్. ఈ చిత్రంలో హీరో పేరు కూడా రోషనే. అంటే ఈ రోషన్ నీ కొడుకు లాంటి వాడా అని అలీ అడిగాడు. అవును నా కొడుకు లాంటివాడే.. ఇప్పుడేంటి అని సుమ బదులిచ్చింది. దీనికి అలీ డబుల్ మీనింగ్ లో.. అదే రాజీవ్ కనకాల ఎప్పుడు కేరళ వెళ్లాడా అని అంటూ సెటైర్ వేశాడు. మీ నోట్లో నోరు పెట్టాను చూడండి.. వెనక్కి తీసుకుంటున్నా అంటూ సుమ బదులిచ్చింది.

 16 ఏళ్ల వయసులో

16 ఏళ్ల వయసులో

అలీ చేసిన ఈ వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. దీనిపై నటి దివ్యవాణి స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. అలీతో తాను నటించినట్లు గుర్తు లేదు కానీ.. ఆయన హోస్ట్ గా వ్యవహరించే అలీతో సరదాగా ప్రోగ్రాంకు తాను హాజరయ్యానని దివ్యవాణి అన్నారు. ఆ ప్రోగ్రాంలో కూడా అలీ నాతో అలాంటి వ్యాఖ్యలే మాట్లాడినట్లు దివ్యవాణి అన్నారు. మీరు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఉండి ఉంటె వెంట పడేవాడిని అని అలీ అన్నట్లు దివ్యవాణి తెలిపారు. ఆ సమయంలో తాను స్పందించలేదని ఆమె తెలిపారు. మనసులో ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి. అవన్నీ పబ్లిక్ గా చెబితే ఎలా అని దివ్యవాణి ప్రశ్నించారు.

 నరికేయాలనేంత కోపం

నరికేయాలనేంత కోపం

అలీ చేసే వ్యాఖ్యాలకు సుమ మనసు నొచ్చుకుని ఉంటుంది. ఆమెకు నరికేయాలనేంత కోపం వచ్చి ఉంటుంది. కానీ వేదికపై ఏం చేయగలదు అని దివ్యవాణి అన్నారు. అలీని ఓ సోదరుడిగా భావించి సలహా ఇస్తున్నా. ఆయన్ని అందరూ ఇష్టపడతారు. ఇకనైనా ఆయన ఇలాంటి కామెంట్స్ మానేయాలని దివ్యవాణి తెలిపారు. హాస్యం ఆరోగ్యకరంగా ఉండాలని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X