»   »  అర్ధరాత్రి ఆ హోటల్ రూమ్ లో ఆమెకేం పని?

అర్ధరాత్రి ఆ హోటల్ రూమ్ లో ఆమెకేం పని?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Geeta Basra
దిల్ దియా హై ,ది ట్రైన్ వంటి చిత్రాల్లో హాట్ హీరోయిన్ గా నటించిన గీతా బస్రా తాజాగా మరో దుమారానికి తెరలేపింది. సెప్టెంబర్ 20 వ తేదీ అర్ధరాత్రి ముంబయిలోని తాజా లాండ్స్ ఎండ్ హోటల్ లోకి ఆమె వెళ్ళింది .అక్కడ ఉన్న హరిభజన్ సింగ్ అనే క్రికెటర్ రూమ్ లో రహస్యంగా ప్రేవేశించింది. అయితే దురదృష్టవశాత్తు ఆ సమయంలో ఆమె అక్కడున్న కొందరి పరిచయస్ధుల కళ్ళల్లో పడింది. దాంతో తెల్లారేసరికల్లా ముంబయి లోకల్ పత్రికల్లో ఆమె హోటల్ లో ఉన్న ఫొటోతో సహా పబ్లిష్ అయింది.

దాంతో కామన్ గానే బాలీవుడ్ లో ఈ విషయం కరెంట్ టాపిక్ గా మారింది. కొందరు చర్చలతో ఆపితే మరికొందరు ఫోన్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్పారుట. అయితే ఎప్పట్లాగే బస్రా ఈ విషయాన్ని మేం జస్ట్ ఫ్రెండ్స్ మి అనే మాటతో కొట్టిపడేస్తోంది. అంతేగాక హరిభజన్ ముంబయి లో ఉన్నప్పుడు మేం తప్పనిసరిగా కలుస్తాం. అందులో తప్పేముంది. అతను ఫన్ గా ఉండే లవింగ్ గై, నేను అతని సమక్షంలో బాగా ఎంజాయి చేస్తానంది.

ఇక హరిభజన్ ఏక్ కిలాడీ ...ఏక్ హసీనా అనే రియాలిటీ షో ప్రమోట్ చేయటానికి సిటీకి వచ్చారు.గత వారం రోజులుగా ముంబయిలోనే మకాం వేసారు. అతను మాత్రం ఈ విషయమై నోరు విప్పటం లేదు. ఇక ఈ విషయం గూర్చి బస్రాతో చాలామంది అతను నిజంగా నీ ప్రెండ్ అయితే అంత రాత్రి పూట హోటల్ కి వెళ్ళాల్సిన పనేంటి అని మళ్ళీ నిలదీస్తున్నారు. కరక్టే కదా...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X