పెళ్లైన 16 రోజులకే అలా.. అక్కడ యాసిడ్ పోస్తానని బెదిరించాడు: హీరోయిన్ ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు
మిగిలిన సినిమా ఇండస్ట్రీల్లో మాదిరిగానే తెలుగు చిత్ర పరిశ్రమలో సైతం చాలా ప్రేమ వ్యవహారాలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు చాలా మంది ప్రేమలో విహరిస్తూ.. తమ బంధాలను పెళ్లి వరకూ తీసుకు వెళ్తున్నారు. కానీ, కొందరు మాత్రం విడాకులు తీసుకుని షాకిస్తున్నారు. అలాంటి వారిలో నోయల్ సీన్, ఎస్తర్ జంట ఒకటి. పెళ్లైన కొంత కాలానికి వీళ్లు విడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎస్తర్ ఊహించని విధంగా కామెంట్లు చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో మీరే చూసేయండి మరి!
అలా ఎంట్రీ ఇచ్చింది
హీరోయిన్ ఎస్తర్'1000 అబద్దాలు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఇందులో సునీల్‌తో కలిసి నటించిన 'భీమవరం బుల్లోడు' చిత్రం మాత్రమే మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత 'గరం', 'జయ జానకి నాయక' వంటి కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. ఈ మధ్య ఎన్నో సినిమాలు, సిరీస్‌లలో చేసింది.

ప్రేమ పెళ్లి చేసుకుని
వరుస ఆఫర్లతో సాగిపోతోన్న సమయంలోనే ఎస్తర్.. సింగర్ కమ్ యాక్టర్ నోయల్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపించారు. ఇది బహిర్గతం అయిన తర్వాత తమ ప్రేమను బహిర్గతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2019లో ఈ జంట తమ కుటుంబ పెద్దల సమక్షంలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది.
విడాకులు తీసుకుని
లవ్ మ్యారేజ్ చేసుకున్న కొన్ని రోజులకే నోయల్ సీన్ - హీరోయిన్ ఎస్తర్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇద్దరూ అప్పటి నుంచి దూరంగా ఉండిపోయారు. అయితే, ఈ విషయాన్ని మాత్రం ప్రపంచానికి తెలియనీయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నేళ్ల క్రితమే న్యాయ బద్ధంగా విడాకులు తీసుకున్నట్లు ఇరువురూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఈ విషయాన్ని తెలిపారు.

మళ్లీ పెదవి విప్పింది
విడాకులు తీసుకున్న తర్వాత ఎస్తర్ దానికి గల కారణాలను చాలా కాలం పాటు ఎప్పుడూ చెప్పలేదు. కానీ, ఈ మధ్య తరచూ దీనిపై మాట్లాడుతోంది. ఇలా తాజా ఇంటర్వ్యూలో ఆమె 'పెళ్లైన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నా. అందుకే అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నా. ఈ కారణంగానే అంత త్వరగా విడాకులు తీసేసుకున్నా' అని చెప్పుకొచ్చింది.
సింపతీ కోసమే అలా
ఎస్తర్ కంటిన్యూ చేస్తూ.. 'నాతో విడిపోయాక నోయల్ నాపై చెడు ప్రచారం చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ షోలో సింపతీ వచ్చేలా మా విడాకుల ఇష్యూను బయటకు తెచ్చాడు. దీంతో ప్రేక్షకుల్లో సానుభూతి పొందాడు కూడా. అప్పుడే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నాకు అనిపించింది. కానీ, దీనిపై నాకు ఎప్పుడూ మాట్లాడాలని అనిపించలేదు' అని తెలిపింది.

యాసిడ్ పోస్తానంటూ
ఈ ఇంటర్వ్యూలో ఎస్తర్ 'నోయల్ నా గురించి బ్యాడ్‌గా మాట్లాడుతూ చేసిన దానికి అందరూ నాదే తప్పు అనుకున్నారు. దీంతో నాపై చాలా మంది ట్రోల్స్ చేశారు. ఓ వ్యక్తి అయితే హైదరాబాద్ వస్తే యాసిడ్ పోస్తానని బెదిరిస్తూ పోస్టు పెట్టాడు. అసలు మా మధ్య ఏం జరిగిందో నాకే తెలుసు. నేను మౌనంగా ఉండడం వల్లే ఇలా జరిగింది' అని ఆవేదన వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











