»   » తెలుగు నటిపై అత్యాచారయత్నం: హీరో, దర్శకుడు అరెస్ట్

తెలుగు నటిపై అత్యాచారయత్నం: హీరో, దర్శకుడు అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఛాన్స్ అని నమ్మించి షూటింగుకు తీసుకెళ్లే నెపంతో కారులో అత్యాచారయత్నానికి పాల్పడ్డ సంఘటన విజయవాడ సమీపంలో చోటు చేసుకుంది. అయితే సదరు నటి ప్రతిఘటించడంతో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురి కావడంతో వెంటనే ఆమె అక్కడి నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలు మాట్లాడుతూ ..సినిమా అవకాశం పేరుతో తనను నమ్మించిన దర్శకుడు చలపతి, హీరో సృజన్ భీమవరంలో షూటింగ్ ఉందని చెప్పి హైదరాబాద్ నుండి కారులో తీసుకెళ్లారని, కారులో వెళ్తున్న సమయంలోనే అసభ్యంగా ప్రవర్తించారని, అత్యాచారయత్నం చేశారని తెలిపారు.

నటి ప్రతిఘటన

నటి ప్రతిఘటన

వారి కీచక చర్య నుండి తప్పించుకునే క్రమంలో నటి ప్రతిఘటనకు దిగడంతో పెనుగులాట జరిగి నిడమానూరు వద్ద కారు ప్రమాదానికి గురైంది. గాయాలపాలైన ఆమె వెంటనే అక్కడి నుండి తప్పించుకుంది.

Puri Wife Lavanya Fires Over Charmi Puri Relation
పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు హైదరాబాద్ నుండి వచ్చి విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడు చలపతి, సృజన్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

బ్లాక్ మెయిల్

బ్లాక్ మెయిల్

ఈ సంఘటనపై నటి మీడియాతో మాట్లాడుతూ... జరిగిన సంఘటన ఎవరికీ చెప్పొద్దని తనను బ్లాక్ మెయిల్ చేశారని, ఎవరికైనా చెబితే నీ కెరీరే నాశనం అవుతుంది, నీకు ఎవరూ ఛాన్స్ ఇవ్వరు అని బెదిరించారని నటి ఆరోపించారు.

పోలీసుల హెచ్చరిక

పోలీసుల హెచ్చరిక

సినిమా అవకాశాల పేరుతో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా షూటింగుకు వెళ్లాల్సి వస్తే కుటుంబ సభ్యులను వెంట తీసుకుని వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

English summary
An upcoming heroine has accused a Telugu film director and an actor of attempt to rape. She said that in the name of film shooting at Bheemavaram, the director and the actor had attempted to rape her on Tuesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu