»   » వరకట్న వేధింపులు : భర్తపై నటి ఫిర్యాదు

వరకట్న వేధింపులు : భర్తపై నటి ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sweta Mishra
భువనేశ్వర్ : వరకట్నం వేధింపులు మాములూ మహిళలకే కాదు, సినీ నటీమణులకూ తప్పడం లేదు. ఇటీవల కాలంలో భర్తలతో వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళల జాబితాలో చేరుతున్న నటీమణుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.

తాజాగా శ్వేతా మిశ్రా అనే నటి వరకట్న వేధింపులకు గురైంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్వేతా మిశ్రా గతంలో పలు ఒడియా చిత్రాల్లో నటించింది. కొన్ని రోజుల తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడిన ఆమె కొంతకాలంగా భర్తతో పాటు స్విట్జర్లాండులో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెపై భర్త వేధింపులు ఎక్కువయ్యాయి.

జులై 12న భర్త సిద్ధార్థ వేధింపుల గురించి ఆమె మహళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఈ విషయాన్ని ఆదివారం ఆమె మీడియాకు వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లో గడ్డకట్టే చలిలలో తనను కటిక నేలపై నిద్రించాలని హింసించే వాడని, విపరీతంగా కొట్టే వాడని మీడియా వారి ముందు వాపోయింది. సిద్ధార్థతో శ్వేతకు జూన్ 24, 2012న వివాహం జరిగింది.

ఈ కేసు గురించి ఏసిపి పికె పట్నాయక్ మాట్లాడుతూ....శ్వేతా మిశ్రా ఫిర్యాదును స్వీకరించామని, వరకట్నం వేధింపులకు పాల్పడిన సిద్ధార్థపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే అతను స్విట్జర్లాండులో ఉండటం వలన ఇంకా అరెస్టు చేయలేకపోయామని తెలిపారు.

English summary
Actress Sweta Mishra, who featured in several Odia movies in her childhood, lodged a complaint at Mahila police station here against her husband, Sidharth Siladitya Padhi, an IT engineer in Switzerland, alleging that he "tortured" her for dowry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu