ఈసారి వర్మను కెలికిన గాయత్రి గుప్తా.. సినీ కీచకులను బజారుకీడ్చిన ఫిదా స్టార్

ఇటీవల కాలంలో ఘనవిజయం సాధించిన ఫిదా చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన నటి గాయత్రి గుప్తా. ఈ చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవికి స్నేహితురాలిగా కనిపించి మెప్పించారు.

By Rajababu

Recommended Video

దానికి కమిటైతే అన్నీ ఇస్తామన్నారు.. -‘ఫిదా’ గాయిత్రి

ఇటీవల కాలంలో ఘనవిజయం సాధించిన ఫిదా చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన నటి గాయత్రి గుప్తా. ఈ చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవికి స్నేహితురాలిగా కనిపించి మెప్పించారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్‌లో వేషాల కోసం పడక గదిలోకి (క్యాస్టింగ్ కౌచ్) రమ్మన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఓ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. గాయత్రి గుప్తా ఏమన్నారో.. ఆమె మాటల్లోనే..

కొత్తవారికే ఇలాంటివి

కొత్తవారికే ఇలాంటివి

కొత్తగా సినీరంగంలోకి వస్తున్న వారికి ఇలాంటివి ఎదురవుతున్నారు. బయట చెబితే పరువు పోతుందనే విషయానికి భయపడి చెప్పడం లేదు. సినీ పరిశ్రమ అసంఘటిత పరిశ్రమ. ఎవరికి చెప్పుకోవాలే తెలియదు. సినిమా సినిమాకు మేనేజ్‌మెంట్ మారిపోతుంది.

టాలీవుడ్‌లో అలాంటివి

టాలీవుడ్‌లో అలాంటివి

టాలీవుడ్‌లో ఏమి జరుగుతున్నది అనే విషయంపై నేను మాట్లాడలేను. నాకు ఎదురైన రెండు అనుభవాలతో భయపడ్డాను. ఆడపిల్ల బయటకు వచ్చి కెరీర్‌ను ఎంచుకొనేటప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. అలాంటివి పునరావృతం కాకుండా నేను మాట్లాడాను.

కమిట్‌మెంట్‌కు ప్రిపేరా అని..

కమిట్‌మెంట్‌కు ప్రిపేరా అని..

వేషాల కోసం పడకగదికి చేరే అంశాలు అన్ని రంగాల్లో కూడా ఉన్నాయి. నిర్మాత, డైరెక్టర్, మేనేజర్స్, నటులు స్థాయిలోనే ఇలాంటి సమస్యలు ప్రారంభమవుతాయి. సినిమా ఆఫర్ ఇచ్చే ముందు కమిట్‌మెంట్ (పడుకోవడానికి ) ఒప్పుకొంటావా? అని అడుగుతారు. ఇలాంటి నీచమైన విషయం నాకూ ఎదురైంది అని గాయత్రి అన్నారు.

వెబ్‌సైట్లలో రకరకాలుగా

వెబ్‌సైట్లలో రకరకాలుగా

నేను ఇంటర్వ్యూలో ఒకటి చెబితే వెబ్‌సైట్లలో మరొటి రాస్తున్నారు. లైంగిక వేధింపులు అంటే వెబ్‌సైట్లలో రేప్ గురైంది అని, మీద చేతులు వేశారట. ఇలా రకరకాలుగా రాస్తున్నారు. ఇలా రాయడం వల్ల నేను రెండు రోజులు మానసిక వేదనకు గురయ్యాను.

అలా ఆఫర్ కోల్పోయాను

అలా ఆఫర్ కోల్పోయాను

క్యాస్టింగ్ డైరెక్టర్ వల్ల అనే మంచి అవకాశం కోల్పోయాను. చాలా పెద్ద బ్యానర్. ఆ తర్వాత ఆ సినిమా డైరెక్టర్‌కు వెల్లడించాను. సినిమా పరిశ్రమ అంటే ఒక రకమైన చెడు భావన ఉంది. దానిని పోగొట్టుకోవడానికే నేను బయటకు వచ్చాను.

రాంగోపాల్ వర్మ గురించి

రాంగోపాల్ వర్మ గురించి

రాంగోపాల్ వర్మ కెలుకుతాడో ఏమో అని చూశాను. కానీ వర్మ అలాంటి వాడు కాదు. నాతో మంచిగా ఉన్నాడు. నేను, ఆయన చాలా విషయాలు మాట్లాడుకొన్నాం. రాజకీయాలు మా మధ్య ప్రస్తావనకు వచ్చాయి. అమ్మాయిలే ఆయనకు ఆఫర్ ఇస్తారు అని తెలుసుకొన్నాను. ఊర్మిలతో ఇలాంటి విషయం ఉందనే కొందరు చెప్పిన విషయంతో భయపడ్డాను.

డైరెక్టర్ ఆఫర్ ఇస్తానని

డైరెక్టర్ ఆఫర్ ఇస్తానని

మరో డైరెక్టర్ నాకు అవకాశం ఇస్తాను అని చెప్పాడు. కానీ పడుక గదిలోకి రావాలని డిమాండ్ చేశాడు. అయితే నేను ఒప్పుకోకపోవడంతో ఆయన రాజీ పడ్డాడు. ఆ తర్వాత ఆయన నాకు వేషం ఇచ్చాడు. షూటింగ్ మధ్యలో నన్ను బతిమాలడాడు. ఓ రోజు కారులో డ్రాప్ చేస్తానని ఏకంగా ఆయన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లి బతిమాలాడు. కానీ బలవంతం చేయలేదు.

ప్రతిభను ఎవరూ పట్టించుకోరు..

ప్రతిభను ఎవరూ పట్టించుకోరు..

సినిమా అంటే ఒక ఆర్ట్. ప్రతిభ పాటవాలు, నటన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నటిగా ఎంపిక చేసుకోవాలి. కానీ కేవలం శారీరక సుఖాన్ని అందించడం ద్వారా వేషాలను పొందడం చాలా దురదృష్టకరం. వేషాల కోసం వేశ్యలుగా మారాలంటే మరో పరిశ్రమ ఉంది కాదా అని ప్రశ్నించారు.

 ఫిదా చిత్ర యూనిట్‌లో

ఫిదా చిత్ర యూనిట్‌లో

సినిమా పరిశ్రమలో అందరికీ ఇలాంటి అనుభవం ఎదురవుతుందని నేను అనుకొను. నేను 11 చిత్రాల్లో నటించాను. అలాంటి వాటిలో ఫిదా ఒకటి. ఆ సినిమా యూనిట్‌లో అలాంటి వారు లేరు. ఫిదాలో నా ప్రతిభ ఆధారంగానే వేషం దక్కింది అని గాయత్రి గుప్తా తెలిపారు.

12 రోజులు కమిట్‌మెంట్

12 రోజులు కమిట్‌మెంట్

రెండేళ్ల క్రితం బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం లభించింది. క్యారెక్టర్ కూడా మంచిది కావడంతో నాకు సంతోషం కలిగింది. కానీ 12 రోజులు కమిట్‌మెంట్ ఇస్తే ఫ్లాట్, కారు గిఫ్టుగా ఇస్తాం అని ఆశచూపారు. అంతేకాకుండా 10 లక్షల రెమ్యునరేషన్ కూడా ఇస్తానరు అని మేనేజర్ చెప్పారు. అయితే పడక మీదకు చేరడం ఇష్టం లేక ఆ వేషాన్ని నిరాకరించి వచ్చేశాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X