»   » సెక్స్ కోసం హీరోయిన్‌కు వేధింపులు: దర్శకుడి గుట్టు రట్టు!

సెక్స్ కోసం హీరోయిన్‌కు వేధింపులు: దర్శకుడి గుట్టు రట్టు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ చిత్ర సీమలో ఓ వివాదం ఇపుడు చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ మూవీ 'జాలీ ఎల్ఎల్‌బి' చిత్ర దర్శకుడు సుభాష్ కపూర్ తనను సెక్స్ కోసం వేధిస్తున్నాడంటూ గీతిక అనే నటి(ఆత్మ, వన్ బై టు, వాట్ ది ఫిష్ చిత్రాల్లో నటించింది) ఆరోపిస్తోంది. దర్శకుడి బండారం బయట పెడుతూ తన ట్విట్టర్ పేజీలో ఓ వీడియో లింక్ కూడా పోస్ట్ చేసింది.

తనను సెక్స్ కోసం వేధించిన దర్శకుడు సుభాష్ కపూర్‌ చెంపపై గీతిక కొట్టినట్లు ఆ వీడియోలో ఉంది. సుభాష్ కపూర్ వైఫ్ మరియు ఔరంగజేబ్ డైరెక్టర్ అతుల్ సబర్వాల్ కూడా ఆ వీడియో కనిపిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ సుభాష్ కపూర్‌తో ఆమె గొడవ పడుతున్నట్లు అందులో ఉంది.

Actress Geetika Accuses Jolly LLB Director Of Sexual Assault

ఈ వీడియో చూసి చాలా మంది షాకయ్యారు. ఈ వీడియో విషయమై వివరణ తీసుకునేందుకు గీతికను సంప్రదించడానికి ప్రయత్నించగా ఆమె సెల్ ఫోన్ స్విచాఫ్ వస్తోంది. మొత్తానికి ఈ వీడియో ఇపుడు బాలీవుడ్లో సంచలనం సృష్టిసోంది. ఆమె మీడియా ముందుకు వస్తే తప్ప అసలు విషయం బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

మరో వైపు దర్శకుడు సుభాష్ కపూర్ ఈ వీడియోపై స్పందించారు. 'ఈ వీడియో చూసి షాకయ్యాను. ప్రస్తుతం నేను నా తర్వాతి సినిమా మొదలు పెట్టే పనులపై బిజీగా ఉన్నాను. నా లాయర్ దీనికి సంబంధించిన విషయాలపై మాట్లడతారు' అని సమాధానం ఇచ్చారు. మరి ఈ వీడియో రియలా? ఫేకా? అనేది తేలాల్సి ఉంది.

English summary
Here is the latest heated controversy in B Town. An actor named Geetika, who was seen in films like Aatma, One by Two and What The Fish, tweeted a link to a shocking video where she accuses Jolly LLB director Subhash Kapoor of sexual assault and is even getting slapped by her. Subhash Kapoor's wife and Aurangzeb director Atul Sabharwal was also present at the scene.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu