బికినీకి త్రివర్ణ పతాకం : నటి అరెస్ట్
పూణె : భారత జాతీయ జెండాను బికినీకి చుట్టుకుని ఫోటోలకు ఫోజు ఇచ్చిన సంఘటనకు సంబంధించి బాలీవుడ్ నటి, మోడల్ గెహ్నా వశిస్ట్‌ను పూణె పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. లోక్ జనశక్తి పార్టీ నేషనల్ సెక్రటరీ వి. రవీంద్ర బ్రహ్మో ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ పని చేసినందుకు గానీ గెహ్నా వశిస్ట్ గతంలో దాడికి గురైన విషయం తెలిసిందే.
పబ్లిసిటీ పెంచుకోవడమే లక్ష్యంగా గెహ్నా వశిస్ట్ లాంటి వాళ్లు బరి తెగిస్తున్నారు. ఇటీవల ఈమె...ఒలంపిక్స్‌లో భారత అథ్లెట్లు గోల్డ్ మెడల్ సాధిస్తే న్యూడ్‌గా పరుగెడుతానంటూ ప్రకటన చేసింది. అంతటితో ఆగకుండా న్యూడ్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నించింది.
జాతీయ జెండాను బికినీ చుట్టుకోవడం ద్వారా వివాదం సృష్టించి పబ్లిసిటీ పెంచుకోవడానికి గెహ్నా వేసిన ప్లాన్ బెడిసి కొట్టి చివరకు అరెస్టుకు దారి తీసింది. మరి ఈమెను చూసైనా.....బరితెగింపు భామలు అదుపులో ఉంటారని ఆశిద్దాం...!


Click it and Unblock the Notifications











