తల్లైన 'నా ఆటోగ్రాఫ్' గోపిక
నా ఆటోగ్రాఫ్, యువసేన చిత్రాల హీరోయిన్ గోపిక ఆ మధ్య ఓ డాక్టర్ ని పెళ్ళి చేసుకుని ఓ ఇంటిదయన సంగతి తెలిసిందే. ఐర్లాండులో ఉంటున్న ఆమె రీసెంట్ గా ఓ పాపకు జన్మనిచ్చి తల్లి అయింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఆమె తల్లితండ్రులు తమ మనమరాలిని చూడటానికి కేరళ నుంచి ఐర్లాండు కు బయిలుదేరనున్నారు. తమ మనమరాలని చూడాలని ఆత్రంగా ఉందని అయితే వీసా కోసం చూస్తున్నామని వారు లోకల్ మీడియాతో చెప్పారు. ఆగస్టు నెలలో గోపిక, ఆమె భర్త, పాపతో కలిసి ఇండియాకి వస్తారు. ఇక గోపిక తెలుగులో లేతమనస్సులు, ముద్దుల కొడుకు, నా ఆటోగ్రాఫ్, వీధి, వీడు మామూలోడు కాదు, విజేత, యువసేన వంటి చిత్రాలు చేసింది. అలాగే వివాహానంతరం గోపిక ఏ చిత్రాలూ చేయలేదు.


Click it and Unblock the Notifications











