For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  డైరక్టర్ ని చెప్పుతో కొట్టిన హీరోయిన్...అరెస్ట్

  By Srikanya
  |

  బెంగళూరు : మీడియా ప్రతినిధుల సమక్షంలో హీరోయిన్‌, దర్శకుడు ఘర్షణ పడ్డారు. ఒక దశలో హీరోయిన్‌ కోపంతో చెప్పుతో దర్శకుడుపై దాడి చేసింది. ఇద్దరూ పోలీసు స్టేషన్‌ మెట్లెక్కారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసారు. బెంగుళూరులో నిన్న(శనివారం) సాయింత్రం జరిగిన ఈ వివాదం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆ హీరోయిన్ పేరు నయనకృష్ణ. దర్శకుడు పేరు రుషి. దర్శకుడే నిర్మాత కావటం ఈ వివాదానికి దారి తీసింది. తనకు రావాల్సిన రెమ్యునేషన్ సెటిల్ చెయ్యకుండా ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేయటం ఆమెకు ఆవేశం తెప్పించింది.

  వివరాల్లోకెళ్తే.... కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ధనుష్, నయన కృష్ణ జంటగా నటించిన కై కోట్టప్పా కై అనే చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆ చిత్ర యూనిట్ బెంగళూరు గాంధీనగరలో శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్ హాట్ గా మారింది. నటి నయన కృష్ణ చిత్ర ద ర్శకుడు రుషిపై చెప్పుతో దాడి చేసింది. ఆమెతో పాటు వచ్చిన కొందరు మహిళలూ ఆయన పై దాడి చేశారు. తీసుకున్న అప్పు తీర్చకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ వారీ దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను,ఆమె అసెస్టెంట్ అనితను పోలీసులు అరెస్టు చేసారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల చేసారు.

  'కొట్లల్లప్పో కై' సినిమా వివరాల్ని తెలిపేందుకు శనివారం మధ్యాహ్నం ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హీరోయిన్‌ నయనకృష్ణ, హీరో ధనుష్‌, దర్శకుడు, నిర్మాతల్లో ఒకరైన రుషి ఇతర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. మీడియా సమావేశం కొనసాగుతుండగానే తనకు రావాల్సిన పారితోషికం బకాయిల గురించి నయన కృష్ణ ప్రస్తావించింది. అందుకు దర్శకుడు రుషి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఇద్దరి మధ్య గలాటా మొదలైంది. తనకు రూ. ఎనిమిది లక్షలు రావాలని, వాటిని వెంటనే అందచేయాలి, లేని పక్షంలో సినిమా పంపిణీ హక్కుల్ని ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అందుకు రుషి నిరాకరించడంతో ఘర్షణ పడ్డారు. తరువాత ఇద్దరూ దగ్గర్లోని ఉప్పారపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

  ఈ ఘటన సినీవర్గాల్లో కలకం సృష్టించింది. వారిద్దరి వైఖరిని సీనియర్లు తప్పుబట్టారు. ఆర్థిక లావాదేవీల్ని నాలుగు గోడల నడుమ పరిష్కరించుకోవడం మాని వీధిన పడ్డారని నిర్మాతల సంఘం అధ్యక్షుడు మునిరత్న విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన వల్ల సినిమా పరువు బజారున పడిందని వాపోయారు. ఇకముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

  English summary
  
 Bangalore police arrested Kannada film actress Nayana Krishna and her associate Anitha for allegedly attacking film director Rushi late on Saturday evening. The incident happened allegedly during a press conference hosted by the director on his upcoming movie. Nayana alleged that Rushi cheated her by not paying the amount due to her for her role as heroine. Nayana was later released on bail.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more