రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ: ఫాంహౌస్‌లో చిల్ అవుతున్నా అంటూ.. వీడియో వైరల్
సినీ రంగాన్ని డ్రగ్స్, రేవ్ పార్టీలు కేసులు వదలడం లేదు. చాలా మంది సినీ ప్రముఖులు, వాళ్లతో సంబంధం ఉన్న వాళ్లు తరచూ పార్టీలకు హాజరు కావడం.. ఆ సమయంలో నిషేదిత ఉత్ప్రేరకాలను వాడడం.. పోలీసులకు చిక్కడం వంటివి జరుగుతున్నాయి.
దీంతో తరచూ ఈ తరహా కేసులు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బెంగళూరు నగర సమీపంలో రేవ్ పార్టీ చేసుకుంటూ కొందరు ప్రముఖులు దొరికిపోయారు. ఇందులో నటి హేమ పేరు ఉండడంతో తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు మీకోసమే!

బర్త్‌డేలో రేవ్ పార్టీ
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఇందులో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు దాడులు చేశారు.
సినిమా వాళ్ల పేర్లు
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కోకైన్ లభ్యమయినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. అంతేకాదు, దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. మరీ ముఖ్యంగా రేవ్ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు కన్నడ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.

నటి హేమ హైలైట్
బెంగళూరులో పోలీసుల దాడుల వల్ల బయటపడ్డ రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది నటీనటులు, యాంకర్ల పేర్లు బయటకు వచ్చాయి. కానీ, అందులో నటి హేమ పేరు బాగా హైలైట్ అవుతోంది. అక్కడి మీడియా ఈమె పేరునే ప్రధానంగా చేసి కథనాలు ప్రచురిస్తోంది. దీంతో బెంగళూరు రేవ్ పార్టీ వల్ల హేమ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

అవన్నీ ఫేక్ అని
దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోన్న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలపై నటి హేమ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో బైట్‌ను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. మొత్తంగా తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం అని ఆమె వెల్లడించారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
చిల్ అవుతున్నా
తాజాగా హేమ షేర్ చేసిన వీడియోలో 'నేను ఎక్కడికీ వెళ్లలేదు.. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఫాం హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. చిల్ అవుతున్నాను. సో.. నా మీద వచ్చే న్యూస్ మొత్తం ఫేక్ న్యూస్. అక్కడ ఎవరున్నారో ఎందుకు నా పేరు వాడుతున్నారో నాకు తెలీదు. అవన్నీ ఎవరూ నమ్మకండి థ్యాంక్యూ' అంటూ చెప్పారు. ఇలా హేమ పుకార్లు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.


Click it and Unblock the Notifications











