twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ నిర్మలకు మనమంతా సెల్యూట్ చేయాలి: హేమ

    |

    ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. ఆమె వయసు 73 సంవత్సరాలు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

    విజయ నిర్మల మృతిపై ప్రముఖ నటి, 'మా' ఉపాధ్యక్షురాలు హేమ స్పందించారు. ''విజయ నిర్మలగారు చనిపోవడం బాధాకరం. 44 సినిమాలకు డైరెక్ట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి ఇండస్ట్రీకి ఎంతో పేరు తెచ్చారు. ఆమెకు మనమంతా సెల్యూట్ చేయాలి.'' అన్నారు.

    Actress Hema Emotional Words about Vijaya Nirmala

    'విజయ నిర్మలగారు హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంటూనే డైరెక్షన్ చేశారు. ఎన్నో మంచి పనులు చేశారు. 'మా' అసోసియేషన్ కోసం సహాయం చేశారు. ఆడవారు ముందుకు వెళ్ళాలి, అన్ని రంగాల్లో రాణించాలి అని వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఇండస్ట్రీలోని మహిళలకు దైర్యం ఇచ్చారు. అలాంటి వ్యక్తి మన తెలుగువారు కావడం గర్వంగా ఉంది.'' అని నటి హేమ తెలిపారు.

    హీరోయిన్‌గా 60కిపైగా చిత్రాల్లో నటించిన విజయ నిర్మల.... దర్శకత్వంలోనూ తన ప్రతిభ చాటారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

    English summary
    Actress Hema Emotional Words about Vijaya Nirmala. Vijaya Nirmala was an Indian film actress, producer and director known for her works predominantly in Telugu cinema. She has directed 44 films in Telugu. In 2002, she entered the Guinness Book of Records as the female director of the most films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X