Don't Miss!
- News లోక్‌సభ ఎన్నికల తర్వాత గందరగోళమే: ఉద్యమ కేసీఆర్‌ను చూస్తారంటూ బీఆర్ఎస్ అధినేత
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విజయ నిర్మలకు మనమంతా సెల్యూట్ చేయాలి: హేమ
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. ఆమె వయసు 73 సంవత్సరాలు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు.
విజయ నిర్మల మృతిపై ప్రముఖ నటి, 'మా' ఉపాధ్యక్షురాలు హేమ స్పందించారు. ''విజయ నిర్మలగారు చనిపోవడం బాధాకరం. 44 సినిమాలకు డైరెక్ట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి ఇండస్ట్రీకి ఎంతో పేరు తెచ్చారు. ఆమెకు మనమంతా సెల్యూట్ చేయాలి.'' అన్నారు.
'విజయ నిర్మలగారు హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంటూనే డైరెక్షన్ చేశారు. ఎన్నో మంచి పనులు చేశారు. 'మా' అసోసియేషన్ కోసం సహాయం చేశారు. ఆడవారు ముందుకు వెళ్ళాలి, అన్ని రంగాల్లో రాణించాలి అని వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఇండస్ట్రీలోని మహిళలకు దైర్యం ఇచ్చారు. అలాంటి వ్యక్తి మన తెలుగువారు కావడం గర్వంగా ఉంది.'' అని నటి హేమ తెలిపారు.
హీరోయిన్గా 60కిపైగా చిత్రాల్లో నటించిన విజయ నిర్మల.... దర్శకత్వంలోనూ తన ప్రతిభ చాటారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.