వాళ్ల అంతు చూస్తాను.. వదిలే ప్రస్తక్తే లేదు.. యూట్యూబ్ ఛానెల్స్‌పై హేమ ఫిర్యాదు

తన ఫ్యామిలీని బజారు పాలు చేస్తున్నారు అంటూ యూట్యూబ్, వెబ్ సైట్లపై నటి హేమ మండిపడ్డారు. తమ కుటుంబంపైనే కాకుండా ఇతర సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులపై అడ్డదిడ్డంగా థంబ్ నెయిల్ పెడుతున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో హేమ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ..

నా భర్తకు తెలిసి ఉండకపోవచ్చు

నా భర్తకు తెలిసి ఉండకపోవచ్చు

యూట్యూబ్‌లో థంబ్ నెయిల్ ఒకటి ఉంటుంది. వీడియో లోపల కంటెంట్ మరోటి ఉంటుంది. నా గురించి య్యూట్యూబ్‌లో పెట్టిన వీడియో గురించి సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఫిర్యాదు చేశాను. మూడు సంవత్సరాల క్రితం నా మ్యారేజ్ యానివర్సరీ సమయంలో నేను నా ఫ్రెండ్స్‌తో సెలబ్రేషన్ చేసుకొన్నాను.

అప్పుడు అందంగా వీడియోలు వేశారు. అవే వీడియోలు తీసుకొని మళ్లీ చెండాళంగా వీడియోలు పెట్టారు. ఈ విషయం నా భర్తకు తెలిసి ఉండవచ్చు.. ఉండకపోవచ్చు. ఇలాంటి వీడియోల వల్ల నా క్యారెక్టర్ దెబ్బ తింటున్నది. నా మనోభావాలు దెబ్బ తిన్నాయి అని నటి హేమ చెప్పారు.

హీరోలతో భార్యలతో డైవోర్స్ అంటూ

హీరోలతో భార్యలతో డైవోర్స్ అంటూ

మార్చి 21వ తేదీ (మంగళవారం) కోట శ్రీనివాసరావు చనిపోయారని యూట్యూబ్‌లో వీడియో పెట్టారు. ఆయన దానికి స్పందించి.. నేను బతికే ఉన్నానని చెప్పి వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. గతంలో కూడా చాలా సినీ ప్రముఖుల గురించి చెడుగా, అవాస్తవాలతో వీడియోలు పెట్టారు. హీరోలు తమ భార్యలతో డైవోర్స్ చేసుకొంటున్నారు.

అలాగే ఓ అమ్మాయి చక్కగా కాపురం చేసుకొంటుంటే.. విడాకులు తీసుకొన్నారంటూ వీడియోలు పెట్టండి అంటూ రకరకాల వీడియో పెడుతున్నారు. వీడియో థంబ్స్‌కు టైటిల్ ఒకటి పెట్టి.. కంటెంట్ మరోలా చూపిస్తున్నారు. దాని వల్ల మాకు మానసికంగా తీరని ఆవేదన, ఫ్యామిలీకి చాలా డామేజ్ కలుగుతున్నది అని హేమ చెప్పారు,

అసభ్యంగా వీడియోలు

అసభ్యంగా వీడియోలు

యూట్యూబ్‌లో అసభ్యంగా, అవాస్తవాలతో వీడియోలు పెడుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల జాబితా ఇచ్చాను. రెండు రోజులు ఆగి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను. కోర్టుకు ఎన్ని రోజులైనా వస్తానని చెప్పాను. ఎవరెవరూ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారో.. వారి జాతకాలన్ని బయటకు తీస్తాను. వారి ఇంటికి వెళ్లి వాళ్ల సంగతి చూస్తాను అని హేమ అన్నారు.

మా జీవితాలను బజారున పడేసే

మా జీవితాలను బజారున పడేసే

గతంలో మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేసే ఒకడు యూఎస్‌లో ఉండేవాడు. వాడిని పట్టుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేశారు. వెబ్ మీడియాపై నేను పోరాటం చేస్తున్నాను. ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే? సెలబ్రీటీలు అయినంత మాత్రాన.. మా వ్యక్తిగత జీవితాలను బజారున పడేసే విధంగా చేయకూడదు. మీరు పెట్టే థంబ్ నెయిల్స్ వల్ల మాకు ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలియదు మీకు. దాని కోసమే నేను వచ్చి కంప్లయింట్ చేశాను అని హేమ చెప్పారు.

యూట్యూబర్లకు ఎథిక్స్, మోరల్స్ లేవు

అసభ్యంగా, ట్రోల్స్ చేస్తూ వీడియోలు బాగా పోస్టు చేశారు. ఒకరు పెడితే.. మరో పదిమంది ఛాన్స్ తీసుకొని వీడియోలు వేస్తున్నారు. యూట్యూబర్లకు ఎథిక్స్, మోరల్స్ లేవు. యూట్యూబ్ వాళ్లు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. వాళ్లెవరో కూడా తెలియదు. వారితో మాట్లాడేందుకు ఛాయిస్ లేదు. కాబట్టి మేము ఫిర్యాదు చేశాం. వారిని ఎక్కడున్నా పట్టుకొస్తాం. వారిని వదిలే ప్రసక్తి లేదు. గతంలో ఒకడిని దుబాయ్ నుంచి పట్టుకొచ్చాం అని హేమ వార్నింగ్ ఇచ్చారు.

వారి అంతు చూస్తాను అంటూ

ఇక నుంచి నా గురించి గానీ, నా ఫ్యామిలీ గురించి గానీ రాసేటప్పుడు ముందు వెనుకా ఆలోచించాలి. నా ఫ్యామిలీని రోడ్డుపైన వేసేందుకు ప్రయత్నిస్తే.. ఊరుకొను. వాళ్ల అంతు చూసే వరకు నిద్రపోను. నేను ఒక్కదాన్నే వచ్చాను. ధైర్యంగా పోరాడుతాను. రేపు కూడా ఒక్కదాన్నే వస్తాను. యూట్యూబ్ ఛానెల్స్ బండారం బయటపెట్టేంత వరకు ఊరుకోను అని హే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X