Don't Miss!
- News AP Elections: ముగిసిన నామినేషన్ల పర్వం- జగన్, బాబు, పవన్ కు పోటీ ఇలా..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కొవ్వెక్కి రాస్తున్నారు.. మార్ఫింగ్‌తో సూసైడ్స్.. వెబ్సైట్లపై హేమ ఫైర్
తప్పుడు వార్తలు, అసత్య కథనాలను రాస్తున్నారంటూ పలు న్యూస్ వెబ్సైట్లపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Recommended Video
తప్పుడు వార్తలు, అసత్య కథనాలను రాస్తున్నారంటూ పలు న్యూస్ వెబ్సైట్లపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా 218 వెబ్సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు మా సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ పలు ఆరోపణలతో కూడిన ఫిర్యాదును పోలీసులకు సమర్పించారు. మా ఫిర్యాదు చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సినీ నటి హేమ పాల్గొన్నారు. ఈ చర్చలో వెబ్సైట్లపై మండిపడ్డారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
సినీ తారలపై బూతులు
తమ బతుకు తెరువు కోసం వెబ్ సైట్ నిర్వాహకులు సినీ తారలపై బూతులు రాస్తున్నారు. కేవలం సినీ ప్రముఖులనే కాకుండా సామాన్యులను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఒకరి మనోభావాలు, ఇమేజ్ దెబ్బ తినే విధంగా రాతలు రాస్తున్నారు. అలాగే సినీ తారల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది.
మహిళలను వెబ్సైట్లు టార్గెట్..
ఫేస్బుక్లో మార్ఫింగ్ చేసిన ఫొటోలు పెట్టడం వల్ల అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సినీ తారలే కాదు.. అన్నీ వర్గాల మహిళలను వెబ్సైట్లు టార్గెట్ చేస్తున్నాయి. వెబ్సైట్ నిర్వాహకులు ఒళ్లు కొవ్వెక్కి ఇలాంటి రాతలు రాస్తున్నారు. ఎక్కడో విదేశాల్లో సర్వర్లు పెట్టుకొని మహిళలపై వెబ్ సైట్లలో తప్పుడు వార్తలు రాస్తున్నారు అని హేమ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రేటింగ్ కోసం అడ్డదార్లు
తమ రేటింగ్ కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. చదువుకి సంబంధించిన వాటిని గూగుల్‌లో వెతికితే ఆ లింకుల పక్కన అశ్లీల వీడియోలు, కథనాలకు సంబంధించిన లింకులు ఉంటున్నాయి అని హేమ పేర్కొన్నది.
కఠిన చర్యలు తీసుకోవాలి
సైబర్ చట్టాల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టాలను మరింత బలోపేతం చేయాలి. మహిళల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి అని పోలీసు శాఖను హేమ కోరింది.