వైరల్ అవుతున్న నటి హేమ వీడియో.. దారుణంగా ట్రోలింగ్, నరేష్ చేయి వేసి!

Recommended Video

Actress Hema Fumbled Speak Telugu At Maa Diary Launch

ఎంతటి సెలబ్రిటీలైనా అప్పుడప్పుడూ పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవి చిన్న పొరపాట్లు అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. నటి హేమ తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్ల బారీన పడింది. దారుణంగా ట్రోలింగ్ కు గురవుతోంది. నటి హేమ వేదికపై ప్రసంగిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవల మా డైరీ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేదికపై కృష్ణ గురించి మాట్లాడుతున్న సమయంలో హేమ టంగ్ స్లిప్ అయింది. ఇంతకీ వేదికపై హేమ ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం..

మా డైరీ లాంచ్

మా డైరీ లాంచ్

'మా డైరీ 2019' లాంచ్ కార్యక్రమం జరిగింది. మా అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు, జయసుధ అతిధులుగా హాజరయ్యారు. కృష్ణ, విజయ నిర్మల చేతుల మీదుగా డైరీ లాంచ్ అయింది. నరేష్, శివాజీ రాజా , పరుచూరి గోపాల కృష్ణ లాంటి సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు.

యాంకర్‌గా మారిన హేమ

యాంకర్‌గా మారిన హేమ

ఈ కార్యక్రమంలో నటి హేమ యాంకర్ గా బాధ్యతలు నిర్వహించింది. కానీ తెలుగు మాట్లాడడానికి ఆపసోపాలు పడింది. సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ టంగ్ స్లిప్ కావడంతో హేమని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎవర్ గ్రీన్ హీరో సూపర్ స్టార్ కృష్ణ అంటూ హేమ బాగానే ప్రారంభించింది. కానీ మధ్యలో తెలుగు పదాలు సరిగా పలకడం చేతకాక ఇబ్బంది పడింది. ఆ సమయంలో హేమ వెనుకే ఉన్న నరేష్ చేస్తున్న సైగలు ఫన్నీగా ఉన్నాయి.

చారిత్రాత్మక చిత్రం

చారిత్రాత్మక చిత్రం

సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ చారిత్రాత్మక చిత్రం అని చెప్పొచ్చు. ఆ సినిమా పేరు పలకడం హేమ వల్ల కాలేదు. ఆంధ్ర జేమ్స్ బాండ్ గా అందరి ప్రజల మనసులు దోచుకున్నారు.. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు చిత్రం గురించి చెప్పబోయిన హేమ బాగా తడబడింది. ఈ సమయంలో సీనియర్ నటుడు నరేష్ ఆమెని సముదాయించే ప్రయత్నం చేశారు. హేమ భుజాన్ని తట్టి ప్రశాంతంగా చదువు అన్నట్లుగా సైగలు చేశాడు.

ప్రసంగం మొత్తం

ప్రసంగం మొత్తం

అల్లూరి సీతారామరాజుతో ఆగిపోలేదు.. హేమ తడబాటు ప్రసంగం మొత్తం కోనసాగింది. అక్కడున్న సెలెబ్రిటీలు కొందరు నవ్వుతూ.. కొందరు ఆశ్చర్యపడుతూ హేమ వంక చూశారు. తన తడబాటుని గమనించిన హేమ.. తనని తాను సముదాయించుకుని ఎలాగైనా నేనే చదువుతాను అని ప్రసంగాన్ని కొనసాగించింది. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలని సన్మానించే ముందు వారు సాధించిన విజయాలు, తెలుగు చిత్ర పరిశ్రమకు వారందించిన విజయాల గురించి హేమ మాట్లాడుతుండగా తడబడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X