twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ డైరెక్టర్లతో గొడవపడ్డాను.. అందుకే ఆ క్యారెక్టర్లు.. స్టేజ్ మీదే హేమ ఎమోషనల్

    |

    యాంకర్ ప్రదీప్ హీరోగా మారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాతో వెండితెరపై ప్రేక్షకులను పలకరించాడు. మొదటి రోజు టాక్ ఎలా ఉన్నా గానీ కలెక్షన్లు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఫస్ట్ డేనే నాలుగు కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇంత పెద్ద హిట్ చేసినందుకు గానూ చిత్రయూనిట్ థ్యాంక్స్ చెబుతూసక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో హేమ మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.

    తల్లి పాత్రలో..

    తల్లి పాత్రలో..

    30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే ఈ సినిమా హేమ తల్లి పాత్రలో అలరించింది. కొడుకుని విపరీతంగా ప్రేమించినా.. కొడుకు నుంచి తిరిగి ప్రేమను పొందుకోలేక కుమిలిపోయే అమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది హేమ. హేమ పాత్రకు అందరూ కనెక్ట్ అవుతున్నారు. అంతలా మంచి పాత్రను తనకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ స్టేజ్ మీదే కన్నీరుపెట్టేసుకుంది.

     డైరెక్టర్లతో గొడవ..

    డైరెక్టర్లతో గొడవ..

    నాకు రెండు మూడు నంది అవార్డులు వచ్చినా.. ఎప్పుడూ నా కళ్లవెంట నీళ్లు రాలేదు. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా.. దాదాపు ఆరేడేళ్ల నుంచి ట్రై చేస్తున్నా.. ఇలాంటి పాత్ర కోసం. ఈ విషయం పూరీ జగన్నాథ్ అన్నయ్యకి బాగా తెలుసు. నేను మదర్ క్యారెక్టర్ కోసం వాడితో ఎంతో గొడవపడేదాన్ని అని హేమ చెప్పుకొచ్చింది.

    ఆ క్యారెక్టర్..

    ఆ క్యారెక్టర్..

    అలాగే సుకుమార్ గారితో కూడా గొడవ పడితే.. ఆయన కుమారి 21F సినిమాలో మదర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ బాగా పండింది.. మంచి పేరు తెచ్చుకున్నా.. కానీ ఎందుకో దర్శకులు ఎవరూ నాకు మళ్లీ మదర్ క్యారెక్టర్ ఇవ్వలేదని హేమ తన అసంతృప్తిని బయటకు చెప్పేసింది.

    జనాల్ని ఏడిపించడమే..

    జనాల్ని ఏడిపించడమే..

    సినిమాకి వెళ్తాం మేడమ్ అని డైరెక్టర్ చెప్తే వచ్చానంతే.. కానీ నాకు ఇక్కడ లభించిన సత్కారం చూస్తే కళ్లవెంట ఆనందభాష్పాలు వస్తున్నాయి. నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఆనందభాష్పాలు రావడం. నాకు ఇంతగొప్ప క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు.. ఈ పాత్రతో జనాల్ని ఏడిపించడమే కాకుండా.. నన్ను కూడా ఏడిపించేశారంటూ హేమ ఎమోషనల్ అయింది.

    Recommended Video

    Tamannaah Shares A Glimpse Of Her Rigorous Workout Routine | Filmibeat Telugu
     జనాలు నవ్వుతారేమో..

    జనాలు నవ్వుతారేమో..

    ఈ సినిమా హీరో ప్రదీప్‌ని నేను తమ్ముడూ.. తమ్ముడూ అంటుంటాను. ఎక్కడ కలిసినా.. గోల గోలగా ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సినిమా విషయంలో తనుకూడా చాలా ఫేవర్ చేశాడు. హేమను తల్లిగా అంటే జనాలు నవ్వుతారేమో కామెడీ అయిపోతుందేమో అని అభ్యంతరం చెప్పకుండా అందరూ సపోర్ట్ చేశారంటూ సినిమా యూనిట్‌కు హేమ ధన్యవాదాలు తెలిపింది.

    English summary
    Actress Hema Overjoyed At 30 Rojullo Preminchadam Ela Success Meet,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X