యాక్టర్ హేమ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ.. ఆ పార్టీలో చేరి జోరుగా ప్రచారం

సినీ నటిగా తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఆ మధ్య రాజకీయాల్లో బిజీగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడంతో కొన్నాళ్ళు అటు వైపు చూడలేదు. కానీ మళ్ళీ చాలా కాలం తరువాత ఆమె రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేశారు. ఇటీవల ఒక నేషనల్ పార్టీ ప్రచారాల్లో కూడా పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది.

మంచి నటిగానే కాకుండా..

మంచి నటిగానే కాకుండా..

వివిధ రకాల హోమ్లీ అండ్ కామెడీ క్యారెక్టర్లతో ఎంతగానో ఆకట్టుకున్న నటి హేమ చేసేది చిన్న పాత్రలే అయినా ఎంతో చక్కగా నటిస్తుంటారు. కేవలం మంచి నటిగానే కాకుండా మంచి వ్యక్తిత్వం కలిగిన హేమ ఇండస్ట్రీలో కో అందరితోనూ స్నేహంగా ఉంటారు. ఇక సినిమాలతో పాటు వివిధ రకాల సోషల్ ఈవెంట్స్ లలో కూడా బాగమవుతూ వస్తున్నారు.

అప్పట్లో.. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో

అప్పట్లో.. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో

మా ఎన్నికల్లో కూడా హడావుడి చేసిన నటి హేమ ఇప్పటికే ఒక కీలక సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికల్లో జోరుగా ప్రచారాలు చేశారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సైమైక్యాంధ్ర పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

అనారోగ్యంతో బ్రేక్..

అనారోగ్యంతో బ్రేక్..

ఎమ్మెల్యేగా పోటీ చేసిన హేమ ప్రచారాల్లో తీరిక లేకుండా పాల్గొన్నారు. కానీ ఆమె అనుకున్నట్లు విజయం సాధించలేకపోయారు. ఇక ప్రచారల్లో తీరిక లేకుండా పాల్గొనడం వలన అప్పట్లోనే అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. ఆరోగ్య దృష్ట్యా కొన్నాళ్ళు రాజకీయాలకు ఆమె దూరమయ్యారు.

మళ్ళీ ఇన్నాళ్లకు.. బీజేపీలో..

మళ్ళీ ఇన్నాళ్లకు.. బీజేపీలో..

ఇక మళ్ళీ ఇన్నాళ్లకు ఆమె రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది హేమ పొలిటికల్ కెరీర్ పై అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక ఎట్టకేలకు ఆమె ఆంద్రప్రదేశ్ భారత జనతా పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువ కప్పుకున్నారు.

Recommended Video

Hema Visits Durga Temple With Her Daughter || బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న హేమ
తిరుపతి ఎన్నికల కోసం ప్రచారాలు

తిరుపతి ఎన్నికల కోసం ప్రచారాలు

ఇక త్వరలోనే జరగనున్న తిరుపతి ఎన్నికల కోసం హేమ ప్రచారాలు మొదలు పెట్టారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ప్రజలకు ఇంకాస్త దగ్గరగా వెళ్లాలని హేమ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ ఆలోచన ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. అలాగే మరికొందరు సినీ ప్రముఖులు కూడా బీజేపీతో కలిసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X