నటి హేమకు బూతు మెసేజ్ పంపిన వ్యక్తి అరెస్టు
హైదరాబాద్: సినీ నటి హేమకు అసభ్యకర మేసేజ్ పంపిన వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరుస్టు చేసారు. గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తి తనకు అసభ్యకర మేసేజ్ పంపుతూ వేధిస్తుండటంతో ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతని పోన్ నెంబర్ ట్రేస్ చేయడం ద్వారా నిందితుడిని పట్టుకున్నారు.
నిందితుడిని నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన మధుగా గుర్తించారు. ఇతడు గతంలో ఇలాంటి కేసుల్లో శిక్ష అనుభవించినట్లు సమాచారం. అతన్ని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని, విచారణ అణంతరం సైబర్ క్రైం క్రిమినల్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు.

హేమగురించిన వివరాల్లోకి వెళితే...1989లో నటిగా కెరీర్ ప్రారంభించిన హేహ, వివాహం కారణంగా నటనకు 1993లో బ్రేక్ యిచ్చింది. 1997లో నటిగా పున:ప్రవేశం చేసి, ఇటు కామెడీ రోల్స్, అటు కేరక్టర్ రోల్స్ ద్వారానూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికి వరకు 300పైగా చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











